కరిగిపోతున్న విదేశీ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల తొలివారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు మరో 12.952 బిలియన్ డాలర్లు తరిగిపోయి 734.61 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
ముంబై, అక్టోబర్ 9: విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల తొలివారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు మరో 12.952 బిలియన్ డాలర్లు తరిగిపోయి 734.61 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 18.343 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. మొత్తంమీద గడిచిన నెల రోజుల్లో రిజర్వులు 51 బిలియన్ డాలర్లు కరిగిపోయినట్టు అయ్యాయి.
సెప్టెంబర్ 4న రికార్డు స్థాయి 785.706 బిలియన్ డాలర్లకు చేరుకున్న రిజర్వులు..ఆ మరుసటి వారం నుంచి దిగువముఖం పట్టాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 10.664 బిలియన్ డాలర్లు తరిగిపోయి 604.747 బిలియన్ డాలర్లకు పడిపోవడం వల్లనే ఫారెక్స్ రిజర్వులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. డాలరేతర కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడం ఇందుకు కారణమని తెలిపింది. అలాగే పసిడి రిజర్వులు 2.288 బిలియన్ డాలర్లు తగ్గి 106.413 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద ఉన్న నిల్వలు మాత్రం 15 మిలియన్ డాలర్లు ఎగబాకి 18.656 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్ నిల్వలు కూడా 15 మిలియన్ డాలర్లు తగ్గి 4.789 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

