క్షీణబాటలోనే ఫారెక్స్ నిల్వలు
భారత్ వద్దనున్న విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఫిబ్రవరి 24తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు మరో 325 మిలియన్ డాలర్ల మేర తగ్గి 560.94 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
- మరో 325 మిలియన్ డాలర్ల తగ్గుదల
ముంబై, మార్చి 3: భారత్ వద్దనున్న విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఫిబ్రవరి 24తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు మరో 325 మిలియన్ డాలర్ల మేర తగ్గి 560.94 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఈ నిల్వలు క్షీణించడం వరుసగా ఇది నాలుగో వారం. అంతక్రితం వారం ఇవి 561.27 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. 2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరినప్పటి నుంచి విదేశీ మారక నిల్వలు మళ్లీ ఆ స్థాయిని చేరుకోలేకపోయాయి. రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 24తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 166 మిలియన్ డాలర్ల మేర తగ్గి 495.91 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
దేశంలోకి వచ్చి, పోయే సొమ్ముతో పాటు అమెరికా డాలర్, యూరో, పౌండ్, యెన్ తదితర విదేశీ కరెన్సీ విలువ పెరుగుదల, తగ్గుదలను కూడా లెక్కించి ఈ కరెన్సీ ఆస్తుల విలువలో చూపుతారు. సమీక్షా వారంలో ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 66 మిలియన్ డాలర్ల మేర తగ్గి 41.75 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. ఇక ఐఎంఎఫ్ జారీచేసే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 80 మిలియన్ డాలర్ల వరకూ తగ్గి 5.10 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
తగ్గడానికి కారణాలు
- అదానీ గ్రూప్ సంక్షోభం నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్ నుంచి రూ. 11,000 కోట్లు వెనక్కు తీసుకోవడం.
- ఒకవైపు ఎగుమతులు తగ్గడం, మరో వైపు దిగుమతులు పెరగడంతో దేశంలోకి వచ్చే విదేశీ కరెన్సీకంటే చెల్లించే కరెన్సీ అధికం కావడం.
- రూపాయి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను ఖర్చుచేయడం.
- గత నెలలో రూపాయి క్షీణించడం తో ఆర్బీఐ వద్దనున్న నిల్వలను రీవాల్యుయేషన్ చేయడం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

