Realty- Investments | రాజకీయ సుస్థిరత.. సమర్థ వృద్ధిరేటు.. రియాల్టీలో పెరుగుతున్న సంస్థాగత పెట్టుబడులు..!
Realty- Investments | రాజకీయ సుస్థిరత, సమర్థ వృద్ధిరేటుతో దేశీయ రియాల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 2024లో కీలక మైలురాయికి చేరుకున్నాయి.
Realty- Investments | గతంతో పోలిస్తే రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. సొంతిండ్లకు, గోదాములకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతన్నది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో సంస్థాగత పెట్టుబడులు క్రమంగా పుంజుకుంటున్నాయి. 2023తో పోలిస్తే దేశీయ రియాల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 51 శాతం వృద్ధి చెందాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2023లో రియాల్టీ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్లు 5.878 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే, ఈ ఏడాది 8.878 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఇక విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా 63 శాతం పుంజుకున్నాయి. రెసిడెన్షియల్ సెగ్మెంట్లోకి 45 శాతం, ఆఫీసు భవనాల నిర్మాణంలో 28 శాతం, గోదాముల నిర్మాణంలోకి 23 శాతం పెట్టుబడులు వచ్చి చేరాయి. ‘రియాల్టీ రంగంలో 2024 ఒక మైలురాయిగా నిలువనున్నది. ఇన్వెస్టర్లకు రియాల్టీ సంస్థల మధ్య జరిగిన 78 ఒప్పందాల్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి 8.9 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చి చేరాయి. 2007 తర్వాత రియాల్టీ రంగంలో రికార్డు స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. 2007లో రియాల్టీ రంగంలోకి 8.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. రియాల్టీ రంగ పెట్టుబడుల్లో ప్రధాన వాటా రెసిడెన్షియల్ సెగ్మెంట్‌దే.
2023తో పోలిస్తే ఆఫీసు భవనాల సెగ్మెంట్ పెట్టుబడులు మాత్రం 17 శాతం తగ్గుముఖం పట్టాయని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. జేఎల్ఎల్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ లతా పిళ్లై మాట్లాడుతూ.. ‘సమర్థవంతమైన వృద్ధి, రాజకీయ సుస్థిరత వంటి కారణాలతో అంతర్జాతీయ ఆర్థిక రంగం నేపథ్యంలో భారత్‌లో వైవిధ్య భరితమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. 2023 నుంచి దేశీయంగా రియాల్టీ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు 2024లోనూ కొనసాగాయని గుర్తు చేశారు. 2019-22 మధ్య సగటున రియాల్టీ రంగంలో 19 శాతం సంస్థాగత పెట్టుబడులు ఉంటే, ఈ ఏడాది అది 37 శాతానికి పెరిగిందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

