ఉద్యోగులకు గుడ్న్యూస్ : వచ్చే ఏడాది 9.4 శాతం సగటు వేతన పెంపు!

న్యూఢిలీ : కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా అరకొర వేతన పెంపుతో సరిపెట్టుకుంటున్న ఉద్యోగులకు తీపికబురు అందింది. వచ్చే ఏడాది సగటు వేతన పెంపు కొవిడ్-19కు ముందున్న పరిస్థితులకు చేరనుంది. ఈ ఏడాది 8.8 శాతంగా అంచనా వేసిన వేతన పెంపు 2022లో 9.4 శాతంగా ఉంటుందని ఏఓఎన్ 26వ వార్షిక వేతన పెంపు సర్వేలో వెల్లడైంది.

39 రంగాలకు చెందిన 1350 కంపెనీలను ఈ సర్వే పలుకరించింది. 2021లో పలు రంగాల్లో ఉద్యోగుల వలసలు, నిష్ర్కమణల రేటు 20 శాతంగా ఉంటుందని దీంతో నియామకాల ప్రక్రియా ఊపందుకుంటుందని సర్వే వెల్లడించింది. వచ్చే ఏడాది ఆశాజనకంగా ఉంటుందని 98.9 శాతం కంపెనీలు అంచనా వేస్తూ 2022లో వేతన పెంపు చేపడతామని చెప్పాయి.
9.4 శాతం సగటు వేతన పెంపు ప్రతిపాదన ఆరేండ్లలో అత్యధిక వేతన పెంపు ఇదే కానుండటం గమనార్హం. 2021లో సగటు వేతన పెంపు 8.8 శాతానికి పరిమితమైంది. సెకండ్ వేవ్ అనంతరం ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటున్న క్రమంలో వచ్చే ఏడాది అంతా సానుకూలంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

అన్ని రంగాల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొందని వచ్చే ఏడాది నాటికి మహమ్మారికి ముందున్న స్ధాయిలో వేతన పెంపులు చేపడతామని పలు సంస్ధలు వెల్లడించాయని సర్వే స్పష్టం చేసింది. ఇక వచ్చేఏడాది ఐటీలో అత్యధికంగా 10.6 శాతం సగటు వార్షిక వేతన పెంపు ఉంటుందని, రియల్ ఎస్టేట్ రంగంలో 8.8 శాతం, రెస్టారెంట్లు, ఆతిధ్య రంగంలో 7.9 శాతం సగటు వేతన పెంపు ఉంటుందని సర్వే అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

