వాణిజ్యలోటు కలవరం
వాణిజ్యలోటు మళ్లీ కలవరపెడుతున్నది. ఒకవైపు ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ అదే సమయంలో దిగుమతులు కూడా భారీగా పుంజుకుంటున్నాయి.
- మూడు నెలల గరిష్ఠానికి చేరుకున్న లోటు
న్యూఢిల్లీ, మే 15: వాణిజ్యలోటు మళ్లీ కలవరపెడుతున్నది. ఒకవైపు ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ అదే సమయంలో దిగుమతులు కూడా భారీగా పుంజుకుంటున్నాయి. గత నెలకుగాను ఎగుమతులు 12.78 శాతం ఎగబాకి 43.56 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇదే సమయంలో దిగుమతులు 10 శాతం అందుకొని ఆరు నెలల గరిష్ఠ స్థాయి 71.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు – దిగుమతుల మధ్య వ్యత్యా సం) మూడు నెలల గరిష్ఠ స్థాయి 28.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 27.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ సందర్భంగా వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ..అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదవడం విశేషమన్నారు. గడిచిన ఐదు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి వృద్ధి అని ఆయన పేర్కొన్నారు.
- ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు 40.31 శాతం అధికమై 5.17 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
- 9.6 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 34.66 శాతం అధికం.
- మెటల్-డెయిరీ ఉత్పత్తులు 48 శాతం, ఇంజినీరింగ్ ఐటమ్స్ 8.76 శాతం, ఫార్మాస్యూటికల్స్ 7.12 శాతం చొప్పున పెరిగాయి.
- సింగపూర్, తాంజానియా, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్, మలేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం దేశాలకు అత్యధికంగా ఎగమతి అయ్యాయి.
- కానీ, పశ్చిమాసియా దేశాలకు మాత్రం ఎగుమతులు 28 శాతం తగ్గి 4.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
- పసిడి దిగుమతులు 81.69 శాతం ఎగబాకి 5.62 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వెండి దిగుమతులు కూడా 157.16 శాతం ఎగబాకి 411 మిలియన్ డాలర్లు.
- క్రూడాయిల్ దిగుమతులు 10 శాతం తగ్గి 18.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

