Batteries Production | దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తి.. విదేశీ సంస్థల పెట్టుబడులపై కేంద్రం ఫోకస్!
Batteries Production | విద్యుత్ వాహనాల్లో కీలక బ్యాటరీల తయారీకి దేశీయంగా యూనిట్ల స్థాపనకు విదేశీ సంస్థలను కేంద్రం ఆహ్వానిస్తోంది.

Batteries Production | రానున్నది విద్యుత్ వాహనాల యుగం.. విద్యుత్ వాహనాల్లో బ్యాటరీలు కీలకం. దేశీయంగా బ్యాటరీల తయారీకి విదేశీ సంస్థలను ఆహ్వానించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకోసం టెస్లా ఇంక్, శ్యామ్‌సంగ్, ఎల్జీ ఎనర్జీ సంస్థలను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. దేశీయంగా క్లీన్ ట్రాన్స్పోర్ట్కు సప్లయ్ చైన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నది.
ఇందుకోసం వచ్చే నెలలో విదేశాల్లో ఐదు రోడ్‌షోల నిర్వహణకు ప్లాన్లు సిద్ధం చేసింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జపాన్లలో ఈ రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఆయా దేశాల్లోని బ్యాటరీల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపి స్థానికంగా ఉత్పాదక యూనిట్లు స్థాపించాలని కోరతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే టెస్లా, ఎల్జీ ఎనర్జీ, శ్యామ్‌సంగ్ సంస్థలను సదరు రోడ్‌షోల్లో పాల్గొనాలని ఆహ్వానించింది. ఆయా సంస్థల డెలిగేట్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లభించలేదు. నార్త్‌వోల్ట్, పనాసోనిక్, తొషిబా వంటి ఇతర సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నది. దేశీయంగా బ్యాటరీల ఉత్పాదక యూనిట్లను స్థాపించే సంస్థలకు 240 కోట్ల డాలర్ల ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే రిలయన్స్, ఆదానీ, టాటా గ్రూప్ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

