ఇండెక్స్ ఫండ్స్ భేష్

ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్‌తో కూడుకున్న పని. సంప్రదాయ స్థిరాదాయ పథకాలపై రాబడి తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మదు పు మార్గాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాస్త రిస్క్ ఉన్నాసరే, రాబడి అధికంగా ఇచ్చే సాధనాల కోసం అన్వేషిస్తున్నారు. గతంలో అధిక రాబడులు, అధిక లిక్విడిటీ, తక్కువ లావాదేవీ చార్జీల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త సాధనాల అన్వేషణ కొనసాగుతున్నది. ఈక్విటీల్లో మదుపు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చేదే అయినా.. రిస్క్, ఒడిదుడుకులు అధికంగా ఉన్న కారణంగా నేరుగా ఈక్విటీల్లో మదుపు చేయడానికి చాలా మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం లేదు. అయితే సులభంగా అర్థమవడంతోపాటు, ఇండెక్స్‌లోని షేర్లలో వాటికిచ్చిన వెయిటేజీ ఆధారంగా మదుపు చేయడంతో ఇండెక్స్ ఫండ్లపై ఈ మధ్య ఆసక్తి పెరిగింది. ఇండెక్స్‌లోని షేర్లలోనే మదుపు చేసే ఫండ్ కనుక ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న షేర్లలోనే మదుపు ఉంటుంది. ఇండెక్స్ కన్నా అధిక రాబడిని ఇచ్చిన చరిత్ర ఈ ఫండ్స్‌కు ఉంది. అలా కాకుండా ఇండెక్స్ కన్నా తక్కువ రాబడి ఇస్తే దాన్ని ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ఇండెక్స్ ఫండ్ల కొనుగోలు, అమ్మకాలపై వ్యయాలు తక్కువే.
మ్యూచువల్ ఫండ్ల రీకేటగిరైజేషన్, బెంచ్‌మార్కింగ్ పద్ధతులను మార్చడంతో ప్రారంభంలో మ్యూచువల్ ఫండ్ల రాబడులు గణనీయంగా తగ్గిపోయినా.. గతేడాది కాలంగా అన్ని రకాల ఫండ్లతోపాటు ఇండెక్స్ ఫండ్లలో కూడా రాబడులు ఇబ్బడిముబ్బడిగానే ఉన్నాయి.
అనుకూలాంశాలు
- వ్యయాలు తక్కువ
- ఇండెక్స్ షేర్లలోనే వెయిటేజినిబట్టి మదుపు
- డైవర్సిఫికేషన్‌తో ప్రయోజనం
- ఫండమెంటల్ పటిష్టంగా ఉండే షేర్లలోనే మదుపు
- ఏ ఒక్క రంగానికో పరిమితం కాకపోవడం
- పారదర్శకత అత్యధికం. రాబడులూ అధికమే ప్రతికూలాంశాలు
- ఇండెక్స్‌కు అవతలి షేర్లలో అవకాశాలు కోల్పోవడం
- బేర్ మార్కెట్లో పనితీరు అంతంత మాత్రమే
- హెవీ వెయిట్ షేర్లలో పతనం అధికంగా ఉంటే రాబడిపై ప్రభావం
- ఇండెక్స్‌ను అనుసరించడం వల్ల ఫండ్ మేనేజర్ పనితీరు పరిమితం
- మార్కెట్ చక్రగతులను అర్థం చేసుకోగలిగితేనే అధిక రాబడులు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

