పన్ను చెల్లింపుదారులంతా ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)ను తప్పక దాఖలు చేయాల్సిందే. ఇందులో వార్షిక ఆదాయం సమాచారం, పన్ను ఆబ్లిగేషన్లుంటాయి. కాగా, ఐటీ చట్టం 1961లోని సెక్షన్లు పన్ను మినహాయింపులు, ప్రభుత్వం నుంచి రాయితీలను కల్పిస్తాయి. ఇంకా ఐటీ ఆదాకున్న మార్గాలను పరిశీలిస్తే రాబోయే 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ వ్యూహాలను అమలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వాటిలో..పన్ను విధానం ఎంపిక
కేంద్ర బడ్జెట్లో రెండు రకాల పన్ను విధానాల ప్రస్తావన ఉన్నది. కాబట్టి ట్యాక్స్ పేయర్లు దీన్ని గమనించి సరైనది ఎంచుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు.
ట్యాక్స్ సేవింగ్ స్కీములు
పాత పన్ను విధానంలో పీపీఎఫ్ ఖాతా, ఈపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్, ఎస్సీఎస్ఎస్, ఎస్ఎస్వై, ఎఫ్‌డీల్లో మదుపు చేయవచ్చు.
ఆరోగ్య బీమా-గృహ రుణం
మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం రూ.25వేలదాకా రీయింబర్స్మెంట్ క్లెయిం చేసుకోవచ్చు. సెక్షన్ 80డీ ద్వారా బీమా కొన్న ఖర్చునూ పన్నుల నుంచి తప్పించవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు రూ.50వేల వరకు పన్ను మినహాయింపు అదనం. అలాగే గృహ రుణం అసలు, వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయం
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ స్కీములు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. గత ఐదేండ్లకుపైగా మదుపరులకు అత్యధిక రాబడులను అందిస్తున్న పథకాల్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌కు చెందినవి కూడా ఉన్నాయి. అవే.. ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్, ఎస్బీఐ కాంట్రా ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్.
ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్
టెక్నాలజీ, టెక్నాలజీ సంబంధిత సంస్థలకు చెందిన ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరులకు ఈ ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ మంచి అవకాశం. మదుపరులకు దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా దీన్ని భావించవచ్చు. ఐదేండ్లుగా నెలకు రూ.12,000 చొప్పున ఈ ఫండ్‌లో మదుపు చేస్తే ఇప్పుడు 84.47 శాతం ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. అంటే రూ.7.2 లక్షల పెట్టుబడిపై మొత్తంగా రూ.13.3 లక్షలు పొందవచ్చు. రూ.6.1 లక్షలు లాభం.
ఎస్బీఐ కాంట్రా ఫండ్
ఐదేండ్లుగా ఎస్బీఐ కాంట్రా ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన మదుపరులు 79.31 శాతం రాబడులను అందుకోగలరు. ఏటా 14.3 శాతానికి తగ్గకుండా ప్రతిఫలాలు వస్తున్నాయి. నెలకు రూ.12,000 పెట్టుబడి ఈ ఫండ్‌లో పెడితే రూ.12.9 లక్షలు తీసుకోవచ్చు. రూ.5.7 లక్షలు లాభం.
ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్
ఇదో వ్యూహాత్మక మ్యూచువల్ ఫండ్. ఎంపిక చేసుకున్న స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెడుతుంది. ఇప్పటిదాకా 84.28 శాతం కచ్చిత రాబడులను మదుపరులకు అందించింది. బెంచ్‌మార్క్ రిటర్న్, కేటగిరి యావరేజ్ రిటర్న్ కంటే ఎక్కువ వార్షిక రాబడులను అందిస్తున్నది.