Moonlight `IT` Lens | వేతన జీవులకు మూన్‌లైటింగ్ ‘షాక్’లు
Moonlight `IT` Lens | ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్ లు రహస్యంగా మరో కంపెనీకి పని చేయడమే మూన్ లైటింగ్.. అలా పని చేసి సంపాదించిన ఆదాయం వివరాలు తమ ఐటీ రిటర్న్స్ లో పేర్కొనలేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఐటీ విభాగం అధికారులు.. వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
అదనపు ఆదాయాన్ని గోప్యంగా ఉంచడమే కారణం
న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఒక సంస్థలో ఉద్యోగిగా కొనసాగుతూనే గుట్టుగా మరో సంస్థకు సేవలు అందించడం (మూన్‌లైటింగ్) ద్వారా సాధారణ వేతనం కంటే అధిక ఆదాయాన్ని ఆర్జించి ఆ మొత్తాన్ని పన్ను రిటర్నుల్లో చూపని ఉద్యోగులకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నోటీసులు పంపుతున్నది. వార్షిక సగటు అప్రకటిత ఆదాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్నవారికి తొలి విడతలో ఈ నోటీసులను పంపుతున్నట్టు ఐటీ అధికారులు వెల్లడించారు.
ఇలా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఇప్పటివరకు 1,100 మందికిపైగా ఉద్యోగులకు నోటీసులు పంపినట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు వెల్లడించారని ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక పేర్కొన్నది. ఈ అప్రకటిత ఆదాయాలకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారా, విదేశీ ఖాతాల ద్వారా జరిగాయని ఐటీ శాఖ గుర్తించినట్టు తెలిపింది.
ఐటీ, అకౌంటింగ్, మేనేజ్మెంట్ రంగాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల నుంచి నెలకోసారి లేదా మూడు నెలలకోసారి ఈ చెల్లింపులను పొందుతున్నారని, కానీ వారంతా ఈ అదనపు ఆదాయాన్ని పన్ను రిటర్నుల్లో చూపకుండా కేవలం ఫుల్‌టైమ్ ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే ప్రకటిస్తున్నట్టు గుర్తించామని ఓ సీనియర్ అధికారి చెప్పినట్టు ఆ పత్రిక తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

