Microsoft Windows : మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ న్యూ హెడ్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి నియమితులయ్యారు. గతంలో ఈ విభాగానికి నేతృత్వం వహించిన పనోస్ పనయ్ స్ధానంలో పవన్ దావులూరి నూతన బాధ్యతులు చేపట్టారు.
పనయ్ అమెజాన్‌లో చేరేందుకు మైక్రోసాప్ట్ విండోస్ హెడ్‌గా గత ఏడాది వైదొలిగారు. పవన్ దావులూరి నియామకం గురించి మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్, డివైజెస్ హెడ్ రాజేష్ ఝా వెల్లడించారు. ఝా పర్యవేక్షణలో పవన్ దావులూరి విండోస్, సర్ఫేస్ బృందాలకు సారధ్యం వహిస్తారు.
ఏఐ, సిలికాన్, ఎక్స్పీరియన్స్లపై ఏఐ టీంతో విండోస్ టీం కలిసి పనిచేస్తుందని ఇంటర్నల్ లెటర్లో ఝా పేర్కొన్నారు. ఇక పవన్ దావులూరి 23 ఏండ్లకు పైగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో ఎంఎస్ పూర్తిచేసిన అనంతరం పవన్ మైక్రోసాఫ్ట్‌లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా చేరారు.
Read More :