Home Loan | హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. ఐతే టిప్స్ మీకోసమే
Home Loan | సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారు అర్హతను బట్టి లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఆ రుణం చెల్లింపునకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి.
Home Loan | ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. కానీ, ఇల్లు కొనుక్కోవడం అంటే తేలికేం కాదు.. భారీగా నిధులు కావాలి. సొంతింటిలో ఉండాలని కోరుకుంటున్నా.. అర్హులైన వారికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇండ్ల రుణాలు బాగానే ఉన్నాయి. ఇంటి రుణం తీసుకుంటున్నప్పుడు దానికి వర్తించే వడ్డీరేట్లు, వివిధ ఆర్థిక సంస్థల నిబంధనలు, షరతులు సరిపోల్చుకోవాలి. ఇంటి రుణం పొందే వారు వాటిపై వచ్చే ఆఫర్లు, టాక్స్ బెనిఫిట్లను చెక్ చేసుకోవడం చాలా కీలకం.
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం రుణంపై ఇల్లు కొనుగోలు చేసిన వారు ఆ రుణానికి వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సెక్షన్ 80సీ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో అసలు చెల్లింపుపై రూ.1.50 లక్షల వరకు పన్ను డిడక్షన్ క్లయిమ్ చేసుకోవచ్చు.
ఇండ్ల కొనుగోలుకు కేంద్రం ప్రోత్సాహాలు
ఎక్కువ మంది సొంతిల్లు కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం అసలుపై పన్ను రాయితీతోపాటు ఇంటి రుణం మీద చెల్లిస్తున్న వడ్డీకి కూడా మినహాయింపు ఇస్తున్నది.
తీసుకున్న ఇంటి రుణంతోపాటు దాని వడ్డీ సరైన టైంలో పే చేయాలి. సులభతరంగా రుణ చెల్లింపులకు తీసుకున్న రుణం, వడ్డీతోపాటు సమానమైన నెలవారీ వాయిదా (ఈఎంఐ)లుగా విభజిస్తారు.
రుణ చెల్లింపులకు ప్లాన్ చేసుకోవాలిలా
ఇంటి రుణం పొందడానికి ప్లాన్ చేసుకునే వారు ఈఎంఐలు సకాలంలో చెల్లించడానికి అవసరమైన వ్యూహాలు రెడీ చేసుకోవాలి. ఈఎంఐలు చెల్లించడానికి ప్రీ-ప్లాన్ చేసుకుంటే ఎంత రుణం పొందవచ్చునన్న విషయం నిర్ధారించుకోవచ్చు. మిగులు ఆదాయాన్ని బట్టి ప్రీ-పేమెంట్ క్కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వడ్డీరేట్లు పెరిగితే ముందస్తు పేమెంట్స్ చేయడం ద్వారా ఈఎంఐలు పెరక్కుండా నివారించుకోవచ్చు.
డౌన్ పేమెంట్ ఆధారంగా ఈఎంఐ ఖరారు
హోంలోన్ తీసుకోవాలని నిర్ణయించుకున్న వారు తాము చెల్లించగల ఈఎంఐ సామర్థ్యానికి అనుగుణంగానే రుణ మొత్తం నిర్ణయించుకోవాలి. మీరు ఇంటికి తీసుకెళ్లే వేతనంలో 40 శాతం వరకు ఈఎంఐ చెల్లింపులకు బ్యాంకులు పర్మిట్ చేస్తాయి. అర్హత లేని అధిక మొత్తం లోన్ కోసం దరఖాస్తు చేస్తే బ్యాంకులు తిరస్కరిస్తాయి. కనుక ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారు తొలుత తమ క్రెడిట్ అర్హత నిర్ధారించుకోవాలి. అలా చేయడంతో డౌన్ పేమెంట్‌కు డబ్బు చెల్లింపు తేలికవుతుంది. మొత్తం ఆస్తి విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ చేస్తే.. రుణం ప్లస్ వడ్డీపై చెల్లించాల్సిన ఈఎంఐ భారం తగ్గుతుంది.
ఇంటి రుణంలో క్రెడిట్ స్కోర్ కీలకం
కొంత మంది క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది. తక్కువ ఆదాయం కూడా ఉంటుంది. అటువంటి వారి రుణ దరఖాస్తులను బ్యాంకులు రిజెక్ట్ చేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో కో-అప్లికెంట్‌ను జత చేసుకోవడం వల్ల వారి రుణ అర్హత, అవకాశాలు పెరుగుతాయి.
కో-అప్లికెంట్‌గా మహిళ ఉంటే ఇలా
ఒక వ్యక్తి సతీమణికి మంచి క్రెడిట్ స్కోర్ ఉందనుకున్నా.. కుటుంబ సభ్యుల్లో ఒక మహిళను కో-అప్లికెంట్‌గా చేర్చుకున్నా లోన్ వేగంగా మంజూరు కావడమే కాదు.. మహిళలకు ఇచ్చే వడ్డీ రేటు రాయితీ 0.05 శాతం పొందొచ్చు. కో- అప్లికెంట్ ఆదాయం కూడా కలిస్తే ఎక్కువ రుణం పొందొచ్చు. ఈఎంఐ పేమెంట్ తేలికవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

