Fixed Deposit | ఫిక్స్డ్ డిపాజిట్లకున్న ప్రతికూలతలు తెలుసా?
Fixed Deposit | ఇప్పటికీ దేశంలో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కున్న ఆదరణ మరోదానికి లేదు. చాలామంది ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెట్టడానికే మొగ్గుచూపుతారు. కేవలం వేతన జీవులేగాక, సీనియర్ సిటిజన్లు, మిల్లీనియన్లు కూడా ఎఫ్డీలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు మరి.
Fixed Deposit | ఇప్పటికీ దేశంలో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కున్న ఆదరణ మరోదానికి లేదు. చాలామంది ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెట్టడానికే మొగ్గుచూపుతారు. కేవలం వేతన జీవులేగాక, సీనియర్ సిటిజన్లు, మిల్లీనియన్లు కూడా ఎఫ్డీలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు మరి. నిరుడు మే నుంచి మళ్లీ పెరుగుతున్న ఎఫ్‌డీల వడ్డీరేట్లూ ఇందుకు ఓ కారణమే. పైగా ‘సురక్షిత పెట్టుబడి సాధనం’ అన్న ట్యాగ్‌లైన్ ఉండనే ఉన్నది. అయితే ఇంతటి పాపులర్ ఎఫ్‌డీలకూ ప్రతికూలతలున్నాయి. అవేంటో తెలుసా..
తక్కువ రాబడులు
ఎఫ్డీలపై ఫిక్స్డ్ వడ్డీరేట్లుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ వంటి పెట్టుబడులతో పోల్చితే రాబడి తక్కువే.
లాక్-ఇన్ పీరియడ్
ఎఫ్‌డీల్లో ఒక్కసారి పెట్టుబడి పెడితే కాలపరిమితి తీరేదాకా ఆ నిధులు అలాగే ఉండిపోతాయి. అత్యవసరాలున్నా వాడుకోలేం.
టీడీఎస్
ఎఫ్డీలపై అందుకునే వడ్డీపై పన్నుంటుంది. దీనివల్ల మీ మొత్తం రాబడులు తగ్గుతాయి. మీ ఆదాయ శ్లాబు రేటు ప్రకారం ఈ పన్ను వర్తిస్తుంది.
ద్రవ్యోల్బణం రేటు..
పెట్టుబడులపై వచ్చే రాబడులు ద్రవ్యోల్బణం రేటును మించేలా ఉండాలి. కానీ ఎఫ్డీలపై పొందే ఆదాయం చాలావరకు తక్కువే ఉంటుంది.
జరిమానాలు
ఎఫ్డీలను నిర్ణీత గడువు కంటే ముందుగానే ఉపసంహరించుకోవడానికి బ్యాంకులు అనుమతిస్తాయి. అయితే ఇందుకు కొంత జరిమానాలు విధిస్తాయి. మొత్తం వడ్డీరేటులో ఇది 1-3 శాతంగా ఉండొచ్చు.
కన్సాలిడేషన్ దశలోనే..
చైనా, హాంకాంగ్ మినహా ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ గతవారం సానుకూలంగానే ట్రేడయినప్పటికీ, భారత్ సూచీలు మాత్రం లాభాల స్వీకరణతో క్షీణించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు కోల్పోయి 18,203 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్ ప్రభుత్వ రుణపరిమితిపై జరుగుతున్న చర్చలు శుక్రవారం అర్థాంతరంగా నిలిచిపోవడం, అదే రోజున రిజర్వ్‌బ్యాంక్ రెండువేల నోట్లను రద్దుచేయడం వంటి పరిణామాలు ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే వరుస వడ్డీ రేట్ల పెంపునకు జూన్‌లో బ్రేక్ వేయనున్నట్టు అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ఇచ్చిన సంకేతాలు ఈక్విటీ మార్కెట్లకు మద్దతును ఇస్తాయని చెపుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీ కన్సాలిడేషన్ దశలోనే ఉందని, గరిష్ఠస్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఉంటుందని, భారీగా క్షీణించే సూచనలు కూడా టెక్నికల్ చార్టుల్లో కన్పించడం లేదని ఈక్విటీఆసియా రీసెర్చ్ వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ వివరించారు.
నిరోధ శ్రేణి 18,350-18,500
నిఫ్టీకి 18,350-18,500 శ్రేణి గట్టిగా అవరోధం కల్పించవచ్చని, ఈ శ్రేణిని అధిగమించేంతవరకూ తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యంకాదని వైష్ణవ్ చెప్పారు. ఈ వారం నిఫ్టీని 18,350, 18,480 స్థాయిలు నిరోధించవచ్చని, 18,040, 17,800 స్థాయిల వద్ద మద్దతు లభిస్తున్నదన్నారు. ఈ వారం నిఫ్టీ 18,300 స్థాయిని దాటితే 18,450-18,500 వరకూ పెరగవచ్చని, 18,100 సమీపంలో ఉన్న మద్దతుస్థాయి కీలకమైనదని యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు రాజేష్ పాల్వియా అంచనా వేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

