Galla Jayadev | రాయితీలు ఇవ్వకపోతే వెళ్లిపోతం.. రేవంత్ సర్కార్‌కు అమరరాజా బ్యాటరీ అధినేత అల్టిమేటం
విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర పారిశ్రామిక దిగ్గజాలలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
- రేవంత్ సర్కార్‌కు షాకిచ్చిన గల్లా జయదేవ్
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలి..
- లేకపోతే రాష్ట్ర ప్లాంట్ విస్తరణ ప్రణాళికను నిలిపివేస్తాం..
Galla Jayadev | హైదరాబాద్/మహబూబ్‌నగర్, ఆగస్టు 10: విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర పారిశ్రామిక దిగ్గజాలలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతోనే తెలంగాణలో సెల్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, కానీ ఈ హామీలను కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెడితే మాత్రం ప్లాంట్ విస్తరణ ప్రణాళికను నిలిపివేస్తామని అమర రాజా బ్యాటరీ అండ్ మొబిలిటీ చైర్మన్ జయదేవ్ గల్లా హెచ్చరికలు జారీ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీతోనే ఇక్కడ రూ.9,500 కోట్ల పెట్టుబడితో బ్యాటరీ, సెల్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చామని, ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తుత సర్కార్ కొనసాగిస్తదని అనుకుంటానని, కానీ వీటిని కొనసాగించకపోతే మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బ్యాటరీ తయారీ ప్లాంట్ విస్తరణ ప్రణాళికను నిలిపివేయాలనుకుంటున్నట్లు ఆయన స్పష్టంచేశారు. దీంతో విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థల చుట్టు తిరుగుతున్న రేవంత్ రెడ్డికి తన సొంత ఇలాకాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న సంస్థ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం విశేషం.
సెల్ తయారీ యూనిట్‌కు భూమిపూజ
మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద అమర రాజా గ్రూపు ఏర్పాటు చేయతలపెట్టిన సెల్ తయారీ యూనిట్‌తోపాటు బ్యాటరీ ప్లాంట్ తొలి దశ యూనిట్‌కు శనివారం భూమిపూజ చేసింది. అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ అనుబంధ సంస్థయైన అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీ(ఏఆర్‌ఏసీటీ) ఈ యూనిట్‌ను పియాజియోతో కలిసి నెలకొల్పబోతున్నది.
అలాగే గత రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ యూనిట్లోనే రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌తోపాటు 16 గిగావాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ గ్రీన్ఫిల్డ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నది. ఈ రెండు యూనిట్లకోసం రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు గతంలోనే ప్రకటించింది. తొలి విడుతలో భాగంగా 8-10 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్‌కు అయ్యే ఖర్చును కంపెనీ అంతర్గత వనరుల ద్వారా సేకరిస్తున్నట్లు, ఒకవేళ అవసరమైతే ఈక్విటీలను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించాలనుకుంటున్నట్లు జయదేవ్ గల్లా తెలిపారు.
- తొలి దశలో బ్యాటరీ ప్లాంట్ కెపాసిటీ 1.5 గిగావాట్లు. దేశీయ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటరీలను తయారు చేస్తున్నది సంస్థ.
- 260 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లు 2031 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది.
- దీనికి అదనంగా హైదరాబాద్‌లో అడ్వాన్స్డ్ ఎనర్జీ రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పబోతున్నది.
- పియాజియోతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా లిథియం ఐరన్ ఫాస్పెట్, లిథియం-అయాన్ సెల్స్, ఈవీ-3 వాహనాలకు చార్జర్లను అభివృద్ధి చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

