ICICI Bank FD | ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించిన ఐసీఐసీఐ
ICICI Bank FD | రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేట్లు సవరించింది. వృద్ధులకు గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ తెచ్చింది.
ICICI Bank FD | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించేసింది. సవరించిన వడ్డీరేట్లు తక్షణం (2022 సెప్టెంబర్ 30) అమల్లోకి వస్తాయని బ్యాంక్ వెబ్సైట్ పేర్కొంది. అన్నిటెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరుగుతాయి. 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించడం గమనార్హం. ఆర్బీఐ గత మే నుంచి ఇప్పటి వరకు 190 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచింది. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 5.90 శాతానికి చేరింది.
ఏడు రోజుల నుంచి 29 రోజుల్లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిక్ పాయింట్లు పెరిగి 2.75 నుంచి 3.0 శాతానికి, 30 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బీపీఎస్ పెంపుతో 3.25 నుంచి 3.50 శాతానికి వడ్డీరేటు పెరిగింది. 91-184 రోజుల మధ్య గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు నుంచి 4.25 శాతానికి, 185-ఏడాది లోపు ఎఫ్డీలపై 4.65 నుంచి 4.90 శాతం వడ్డీరేటు పెరిగింది.
ఏడాది నుంచి రెండేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 5.50 నుంచి 5.70 శాతానికి, రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు ఎఫ్డీలపై వడ్డీ 5.60 నుంచి 5.80 శాతానికి, మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు ఎఫ్డీలపై 6.10 శాతం, 5-10 ఏండ్ల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆరు శాతం వడ్డీ లభిస్తుంది. 60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 6.60 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ
ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్ల కోసం గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. భారత్‌లోనే ఉన్న సిటిజన్లకు అదనంగా 0.10 శాతం వడ్డీ కల్పిస్తున్నట్లు తెలిపింది. అంటే సీనియర్ సిటిజన్లకు సాధారణంగా ఇస్తున్న అదనపు 0.50 శాతం వడ్డీ కంటే ఇది ఎక్కువ. అంటే గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 0.60 శాతం వడ్డీ అధికంగా చెల్లిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

