IBM : ఉద్యోగుల సంఖ్యను కుదించాలని యోచిస్తున్న ఐబీఎం ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరుతోంది. కంపెనీలో పనిచేయాలని కోరుకోని వారు స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని ఐబీఎం చెబుతోంది. ఐబీఎం నుంచి బయటకు వెళ్లాలని కోరుకోని ఉద్యోగులను మాత్రం కంపెనీ తొలగించాలని అనుకోవడం లేదని ఓ వార్తా కధనం వెల్లడించింది.
ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో ఐబీఎం ధోరణిలో మార్పు కనిపిస్తోంది. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని భావించే ఉద్యోగులు ముందుకు రావాలని ఐబీఎం కోరుతోంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే క్రమంలో కంపెనీ చేపట్టే చర్యల్లో ఇది ఓ భాగమని చెబుతున్నారు. ఐబీఎం ఈ చర్యను రిసోర్స్ యాక్షన్‌గా అభివర్ణిస్తోంది.
గత నెలలో నాలుగో త్రైమాసిక ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా స్వచ్ఛంద రాజీనామాల ప్రతిపాదనపై కంపెనీ సంకేతాలు పంపింది. కంపెనీని వీడటం ఇష్టం లేని వారిని లేఆఫ్స్‌తో తొలగించడం కంటే స్వచ్ఛందంగా తప్పుకునే ఉద్దేశం ఉన్న ఉద్యోగులను గుర్తించాలనే ఉద్దేశంతో ఐబీఎం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. అయితే స్వచ్ఛంద రాజీనామాల పేరిట ఎంత మంది ఉద్యోగులను కంపెనీ టార్గెట్ చేసిందనే వివరాలు వెల్లడికాలేదు.
Read More :
Skin cancer | క్యాన్సర్‌ను నియంత్రించే బియ్యం.. చర్మ క్యాన్సర్‌కు చెక్..!