Hyundai’s EXTER | హ్యుండాయ్ నుంచి మార్కెట్లోకి మరో ఎస్యూవీ `ఎక్స్టర్`.. ద్వితీయార్థంలో ఆవిష్కరణ?!
Hyundai's EXTER | భారత్ మార్కెట్లోకి త్వరలో మరో ఎస్ యూవీ కారు `ఎక్స్ టర్` తీసుకొస్తామని ప్రకటించింది. ఈ కారు టాటా పంచ్ తో పోటీ పడుతుందని వెల్లడించింది.
Hyundai’s EXTER | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇవ్వడం.. అందునా కుటుంబ సభ్యులంతా కూర్చునే వెసులుబాటు గల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) కార్లకు పెరిగిన గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కార్ల తయారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. మారుతి సుజుకి మొదలు టాటా మోటార్స్, హ్యుండాయ్, కియా మోటార్స్, హోండా కార్స్, లంబోర్ఘిని వరకు ప్రతి సంస్థ ఎస్యూవీలపైనే ఫోకస్ చేస్తున్నాయి. అందులో భాగంగా హ్యుండాయ్ మోటార్స్ ఇండియా (హెచ్ఎంఐఎల్) కొత్తగా మార్కెట్లోకి తేనున్న ఎస్యూవీ కారుకు పేరు పెట్టింది. `ఎక్స్టర్ (EXTER)` అనే పేరుతో భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మార్కెట్లోకి తెస్తామని వెల్లడించింది.
హ్యుండాయ్ మోటార్స్ ఇండియా `ఎక్స్టర్` ఎస్యూవీ కారు.. టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లోని `టాటా పంచ్`తో తలపడుతుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ ఎక్స్టర్ కారును వచ్చే జూన్‌లో ఆవిష్కరించవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలుత ఈ నెల ఐదో తేదీన ఎక్స్టర్ కారు ఇమేజ్ సోషల్ మీడియాలో వెలుగు చూసింది.
హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మైక్రో ఎస్యూవీ కారు `ఎక్స్టర్` రూపుదిద్దుకున్నది. పలుసార్లు దేశీయ రోడ్లపై ప్రయోగాత్మకంగా ఎక్స్టర్ కారును పరీక్షించారు. స్మార్ట్ మొబిలిటీకి మారుపేరుగా ఈ కారు నిలుస్తుందని సమాచారం.
బాడీ క్లాడింగ్, రూఫ్ రయిల్స్, హెవీ బానెట్, హెచ్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, టైల్ లైట్స్, ఫంకీ అల్లాయ్ వీలర్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇంటిరీయర్గా ఐకానిక్ 5ఈవీ తరహాలో న్యూ జనరేషన్ స్టీరింగ్ వీల్, 42-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూ లింక్ కనెక్టివిటీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, మూడ్ లైటింగ్, వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఔరా వంటి కార్లలో మాదిరిగా 1.2-లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 82 బీహెచ్పీ విద్యుత్, గరిష్టంగా 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. లీటర్ పెట్రోల్‌పై ఈ కారు 20.1 కి.మీ. మైలేజీ ఇవ్వనున్నది. అత్యాధునిక ఎస్యూవీ ఎక్స్టర్ ధర రూ.6 లక్షలు ఉండొచ్చునని భావిస్తున్నారు.
హ్యుండాయ్ మోటార్స్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ స్పందిస్తూ.. తమ సంస్థ మార్కెట్లోకి మరొక ఎస్యూవీ కారు తెస్తామని ప్రకటించినందుకు గర్వ పడుతున్నట్లు తెలిపారు. హ్యుండాయ్ నుంచి మార్కెట్లోకి వస్తున్న ఎనిమిదో ఎస్యూవీ కారు ఎక్స్టర్. సమీప భవిష్యత్‌లో ఎస్యూవీ కార్ల విభాగంలో బలోపేతం అవుతామన్నారు. ప్రస్తుతం హ్యుండాయ్ మోటార్స్.. వెన్యూ, వెన్యూ ఎన్‌లైన్, అల్కాజర్, క్రెటా, టస్కన్, కోనా ఎలక్ట్రిక్, ఐయానిక్5 తదితర పేర్లతో ఎస్‌యూవీలు మార్కెట్లోకి తెచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

