Hyundai | టాటా మోటార్స్‌పై హ్యుండాయ్ పై చేయి.. గత నెలలో కార్ల సేల్స్ ఎన్నంటే?!
Hyundai | టాటా మోటార్స్‌తో గట్టిపోటీనెదుర్కొంటున్న హ్యుండాయ్ .. గత నెలలో పైచేయి సాధించింది. 2022లో 3000కి పైగా కార్లు విక్రయించింది.

Hyundai | కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్‌ను హ్యుండాయ్ దాటేసింది. గత నెల విక్రయాల్లో తిరిగి రెండో స్థానానికి చేరుకున్నది. గతేడాది డిసెంబర్ నెల కార్ల విక్రయాల్లో టాప్-2 స్థానంలో టాటా మోటార్స్ నిలిచింది. గత నెలలో హ్యుండాయ్ మోటార్స్ 44,022 కార్లు విక్రయించగా, టాటా మోటార్స్ 40,777 యూనిట్లు మాత్రమే విక్రయించింది. టాటా మోటార్స్ కంటే హ్యుండాయ్ మోటార్స్ కార్లు మూడు వేలకు పైగా నమోదయ్యాయి.
అయితే, 2021తో పోలిస్తే హ్యుండాయ్ మోటార్స్ కార్ల విక్రయాలు దేశీయంగా 15.35 శాతం తగ్గుముఖం పట్టాయి. గతేడాది జనవరిలో 52,005 కార్లు అమ్ముడయ్యాయి. 2021 డిసెంబర్లో 32,312 కార్లు విక్రయించగా, గతనెలలో 36 శాతం గ్రోత్ నమోదైంది.
సెమీ కండక్టర్ చిప్‌ల కొరత వల్లే భారీగా కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని హ్యుండాయ్ తెలిపింది. హ్యుండాయ్ మోటార్ నూతన మోడల్ కార్లన్నీ టెక్నాలజీతో అనుసంధానమై ఉండటంతో చిప్‌ల కొరత ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నది. టాటా మోటార్స్ నుంచి హ్యుండాయ్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ విదేశాలకు కార్ల ఎగుమతిలో హ్యుండాయ్ మొదటి స్థానంలో నిలిచింది.
గత నెలలో హ్యుండాయ్ మోటార్స్.. ఇండియా నుంచి 9,405 కార్లను ఎగుమతి చేసింది. 2021తో పోలిస్తే 16 శాతం గ్రోత్ నమోదు చేసింది. గతేడాది 8,100 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేసింది. డిసెంబర్ నెలలో 16,621 కార్లు ఎగుమతి చేసిన హ్యుండాయ్ కార్ల ఎగుమతులు 2022 జనవరిలో 43.4 శాతం తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

