Hyundai Exter | టాటా పంచ్`తో సై అంటే సై హ్యుండాయ్ ఎక్స్టర్.. వచ్చేనెలలో మార్కెట్లోకి..?!
Hyundai Exter | వచ్చేనెల మార్కెట్లోకి రానున్న హ్యుండాయ్ మైక్రో ఎస్యూవీ కారు `ఎక్స్టర్`.. టాటా మోటార్స్ `పంచ్`కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Hyundai Exter | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా అధికారికంగా తన మైక్రో-ఎస్యూవీ కారు ‘హ్యుండాయ్ ఎక్స్టర్’ను ఆవిష్కరించింది. వచ్చేనెలలో భారత్ రోడ్లపై పరుగులు తీయనున్న ఎక్స్టర్.. టాటా మోటార్స్ పంచ్`కి గట్టి పోటీ ఇవ్వనున్నది. ఇప్పటికే ఎక్స్టర్ కారు కోసం దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. ఆసక్తి గల వారు రూ.11 వేలు చెల్లించి ప్రీ-బుకింగ్ నమోదు చేసుకోవచ్చు.
హ్యుండాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుండాయ్ ఔరా మోడల్ కార్ల స్ఫూర్తితో ఎక్స్టర్ వస్తున్నది. ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 83 పీఎస్ విద్యుత్, 113.8 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. బయో-ఫ్యూయల్ ఆప్షన్ (పెట్రోల్ + సీఎన్జీ) విత్ 5-స్పీడ్ ఎంటీ ఆప్షన్ లోనూ వస్తున్నది.
హ్యుండాయ్ మైక్రో ఎస్యూవీ కారు ఎక్స్టర్ ఐదు వేరియంట్లు – ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ), ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ల్లో లభ్యం అవుతుంది. మిగతా హ్యుండాయ్ కార్ల మాదిరిగానే ఎక్స్టర్ సైతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తోపాటు పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్లెతో వస్తుంది. గ్రిల్లెపై ఎక్స్టర్`మానికెర్ అని చూడొచ్చు. స్పోర్టీనెస్ కోసం హెచ్-సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఫీచర్లు ఉంటాయి. డైమండ్ కట్ అల్లాయ్ వీలర్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ విత్ పారామెట్రిక్ డిజైన్ సీ-పిల్లర్ గార్నిష్, బ్రిడ్జి టైప్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.
హ్యుండాయ్ ఎక్స్టర్ కారు సిక్స్ మోనోటోన్, త్రీ డ్యుయల్ టోన్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాస్మిక్ బ్లూ, రేంజర్ కాకీ కలర్స్ లోనూ సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ధర రూ.6-9.5 లక్షల మధ్య పలుకవచ్చునని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

