Maruti Suzuki Grand Vitara | గ్రాండ్ విటారాపై మారుతి బంపరాఫర్.. కారణమిదేనా..?!
Maruti Suzuki Grand Vitara | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన ఎస్యూవీ 5-డోర్ గ్రాండ్ విటారాపై ఈ నెలాఖరు వరకూ రూ.87 వేల నుంచి రూ.1.02 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నది.
Maruti Suzuki Grand Vitara | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన ఎస్యూవీ 5-డోర్ గ్రాండ్ విటారాపై భారీ ఆఫర్లు అందిస్తున్నది. హైబ్రీడ్ వేరియంట్ గ్రాండ్ విటారా మోడల్ కార్ల కొనుగోలుపై ఈ నెలాఖరు వరకూ రూ.87 వేల వరకూ రాయితీలు అందిస్తున్నది. 2023 స్టాక్ నిల్వల ప్రకారం రూ.1.02 లక్షల వరకూ రాయితీలు లభిస్తాయి.
హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, ఎంజీ ఆస్టర్ కార్లకు మారుతి సుజుకి గ్రాండ్ విటారా పోటీ ఇవ్వనున్నది. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్ కార్లపై కన్జూమర్ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.50 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7,000 అందిస్తున్నది. దీంతో గ్రాండ్ విటారా కొనుగోలుదారులు మొత్తం రూ.87 వేల డిస్కౌంట్ పొందొచ్చు. 2023 స్టాక్స్ ప్రకారం కొనుగోలుదారులకు రూ.45 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.50 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7,000 కలిపి మొత్తం రాయితీ రూ.1.02 లక్షలు లభిస్తుంది.
మారుతి సుజుకి మిడ్ సైజ్ ఎస్యూవీ కారు గ్రాండ్ విటారా హైబ్రీడ్ వర్షన్ 1.5 -లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 92 పీఎస్ విద్యుత్, 122 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 80 పీఎస్ విద్యుత్, 141 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. హైబ్రీడ్ సిస్టమ్ గరిష్టంగా 116 పీఎస్ విద్యుత్ వెలువరిస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు లీటర్ పెట్రోల్‌పై 27.97 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. హైబ్రీడ్ వర్షన్ కారు ట్యాంకులో 45 లీటర్ల సామర్థ్యం ఉంటుంది. ఒకసారి ట్యాంక్ నింపితే 1,258 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. మారుతి సుజుకి స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్ కార్లు జెటా+, ఆల్ఫా + వేరియంట్లలో లభిస్తుంది.
జెటా + ధర రూ.18.33 లక్షలు
జెటా + డ్యుయల్ టోన్ రూ.18.59 లక్షలు
ఆల్ఫా + ధర 19.93 లక్షలు
ఆల్ఫా+ డ్యుయల్ టోన్ రూ.20.09 లక్షలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

