Hyundai Creta Facelift | జనవరి 16న మార్కెట్లో హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ రిలీజ్.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Hyundai Creta Facelift | దేశీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారుగా నిలిచిన క్రెటా.. అప్ డేటెడ్ వర్షన్ క్రెటా ఫేస్ లిఫ్ట్.. జనవరి 16న భారత్ మార్కెట్లోకి రానున్నదని తెలుస్తున్నది.
Hyundai Creta Facelift | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా కార్లలో భారత్ మార్కెట్లో అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్రెటా నిలిచింది. ఎస్యూవీ సెగ్మెంట్లో ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీకి 2020 ప్రారంభంలో క్రెటా ఆవిష్కరణతో హ్యుండాయ్ మోటార్స్ సమాధానం చెప్పింది. నాటి నుంచి దేశీయంగా ఎస్యూవీ సెగ్మెంట్ కార్ల విక్రయాల్లో తన స్థానాన్ని మరింత మెరుగు పర్చుకుంటున్నది. తాజాగా వచ్చే ఏడాది జనవరి 16న క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారును మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ స్ప్లిట్ వర్టికల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, హెచ్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, న్యూ గ్రిల్లె డిజైన్ ఉంటుందని తెలుస్తున్నది. న్యూ టెయిల్ గేట్‌తోపాటు రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయని సమాచారం. కియా సెల్టోస్ మాదిరిగా ఇంటీరియర్‌గా 360-డిగ్రీ కెమెరా, అడాస్ సూట్ వ్యవస్థలు ఉంటాయి.
హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు ఇంజిన్ 1.5-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ 160 హెచ్‌పీ విద్యుత్ వెలువరించడంతోపాటు మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో కూడి వస్తుంది.
ప్రస్తుత మోడల్ క్రెటాతో పోలిస్తే క్రెటా ఫేస్ లిఫ్ట్ ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, సిట్రోన్ సీ ఎయిర్ క్రాస్, హోండా ఎలివేట్ మోడల్ కార్లతో పోటీ పడనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

