హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): యూరప్ దేశాలను సందర్శించేవారికి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతున్నది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు విమాన సర్వీసును లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ప్రారంభించబోతున్నది. జనవరి 16 నుంచి అందుబాటులోకి రానున్న బోయింగ్ బీ787-9 డ్రీమ్‌లైనర్‌లో 26 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ, 247 ఎకానమీ క్లాస్ సీట్లు ఉండనున్నాయి.
ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉదయం 10 గంటలకు(లోకల్ టైం) ప్రారంభంకానున్న ఈ విమాన సర్వీసు హైదరాబాద్‌కు రాత్రి 11 గంటలకు చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో ఆ మరుసటి రోజు హైదరాబాద్‌లో రాత్రి 1 గంటలకు బయలుదేరి ఉదయం 6.10 గంటలకు(లోకల్ టైం) ఫ్రాంక్‌ఫర్ట్‌కు చేరుకోనున్నది. ఈ విమానం వారానికి మూడుసార్లు(మంగళ, శుక్ర, ఆదివారాలు) నడవనున్నది.