Home Loans | మీ హోం లోన్‌తో రూ.61 వేల పన్ను ఆదా చేయడం ఎలా..?!
Home Loans | బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న సత్య ప్రకాశ్.. ఇంటి రుణం, ఎన్పీఎస్ లో మదుపు, తదితర పొదుపు ఆప్షన్లతో ఏటా రూ.61 వేల వరకూ ఆదాయం పన్ను ఆదా చేయొచ్చు.
Home Loans | హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ బ్యాంకు శాఖ మేనేజర్‌గా పని చేస్తున్న సత్య ప్రకాశ్.. తక్కువ ఆదాయ పన్ను చెల్లిస్తుంటారు. దీనికి కారణం అతని వేతన చెల్లింపులు టాక్స్ ఫ్రెండ్లీగా ఉండటమే. బ్యాంకు మేనేజర్‌గా ఇంటి రుణం, బ్యాంకు యాజమాన్యం నుంచి ఎన్పీఎస్ బెనిఫిట్ కల్పించడం తదితర అంశాలతో సత్యప్రకాశ్ చెల్లిస్తున్న ఆదాయం తక్కువగా ఉంటుంది. సదరు బ్యాంకు యాజమాన్యం ఇతర సిబ్బందితోపాటు సత్య ప్రకాశ్‌కు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్‌గా ‘ఎన్పీఎస్’ ఆఫర్ చేసింది. దీనికి తోడు సత్య ప్రకాశ్ సొంతంగా ఏటా రూ.50 వేలు `ఎన్పీఎస్’ లో మదుపు చేస్తున్నారు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (2) సెక్షన్ ప్రకారం బేసిక్ వేతనంలో పది శాతం ఎన్పీఎస్’లో మదుపు చేస్తే టాక్స్ ఫ్రీ లభిస్తుంది. ఒకవేళ ప్రతి నెలా రూ.5,389 (బేసిక్ వేతనంలో పదిశాతం) ఎన్పీఎస్’లో జమ చేస్తే సత్య ప్రకాశ్ చెల్లించాల్సిన పన్ను దాదాపు రూ.13,500 తగ్గుతుంది.
బ్యాంకు ఉద్యోగిగా సత్య ప్రకాశ్ ఆకర్షణీయ రాయితీలతో ఇంటి రుణం తీసుకున్నారు. సొంతిల్లు కొనుగోలు చేయడానికి 20 ఏండ్ల టెన్యూర్‌తో ఏడు శాతం వడ్డీపై రూ.25 లక్షలు ఇంటి రుణం తీసుకున్నారు. దీని ప్రకారం ఈఎంఐ రూ.20 వేలు, ప్రతిఏటా చెల్లించే వార్షిక వడ్డీ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుంది. దీంతో దాదాపు రూ.31 వేల పన్ను తగ్గుతుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులో పని చేస్తున్నందున సత్య ప్రకాశ్.. టాక్స్ ప్రీ అలవెన్స్‌లు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ అలవెన్స్ లేదా బుక్స్ – దినపత్రికల బిల్లులతో పన్ను ఆదా అవుతుంది. ఈ రూపంలో రూ.9,500 పన్ను తగ్గుతుంది. తన భార్యా పిల్లలతోపాటు తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25 వేలు ఉంటే.. పన్ను రూ.5,200 తగ్గుతుంది. ఇంకా జీవిత బీమా పాలసీలతో మరి కొంత పన్ను ఆదా అవుతుంది.
సత్య ప్రకాశ్ వార్షిక వేతనం రూ.6,46,580, కరవు భత్యం రూ.2,86,092, స్పెషల్ అలవెన్స్ 1,52,976, కన్వీనెన్స్ అలవెన్స్ రూ.48 వేలు, మెడికల్ అలవెన్స్ రూ.10,500, న్యూస్ పేపర్లు, పుస్తకాల అలవెన్స్ రూ.6,000, మీల్ కూపన్స్ రూ.4,200, టెలిఫోన్ బిల్లు రీయింబర్స్ మెంట్ రూ.3,600, ఎల్‌టీఏ రూ.40 వేలు, ఎన్పీఎస్’లో బ్యాంకు యాజమాన్యం భాగస్వామ్యం రూ.85,252, సత్య ప్రకాశ్ సొంతంగా రూ.50 వేలు (పది శాతం వరకూ పన్ను మినహాయింపు), ఇతర మార్గాల్లో ఆదాయం రూ.25,500 కలిపి మొత్తం రూ.12,52,300.
మొత్తం రూ.12,52,300 ఆదాయంలో ప్రతి ఏటా ఎన్పీఎస్ (ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (2)) కింద రూ.96 వేలు, జీవీ బీమా రూ.60 వేలు, ఎన్పీఎస్ (ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (1బీ) కింద రూ.50 వేలు కలుపుకుంటే మొత్తం రూ.2,06,000పై పన్ను ఆదా అవుతుంది. వీటితోపాటు ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.1.50 లక్షలు, వైద్య ఆరోగ్య బీమా కింద రూ.25 వేలు కలుపుకుంటే రూ.1.75 లక్షలు పన్ను మినహాయింపు పొందొచ్చు. దీని ప్రకారం ప్రతి ఏటా రూ.85,020 పన్ను చెల్లించాల్సి ఉండగా, రూ.61,603 పన్ను ఆదా అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

