Flight Ticket Cancel-Refund | విమాన టికెట్ క్యాన్సిలేషన్.. వంద శాతం రీఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసా?!
Flight Ticket Cancel-Refund | అనూహ్య పరిస్థితుల్లో విమాన టికెట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే, పూర్తిగా రీఫండ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకోవాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.
Flight Ticket Cancel-Refund | విమాన ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విమాన ప్రయాణ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే, అందులో గణనీయ మొత్తం క్యాన్సిలేషన్ చార్జీల కింద సంబంధిత ఎయిర్‌లైన్స్ తీసుకుంటుంది. అత్యధిక కేసుల్లో విమాన టికెట్ క్యాన్సిలేషన్ చార్జీలు 70-80 శాతం పోగా, మీకు కొద్ది మొత్తమే రీఫండ్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని టిప్స్ పాటిస్తే మీ టికెట్ క్యాన్సిలేషన్ చార్జీలు తగ్గించుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న మొత్తం డబ్బులు రీఫండ్ అవుతాయి. అదెలాగో చూద్దామా..!
టికెట్ బుకింగ్ టైంలోనే ఇన్సూరెన్స్
మీ ప్రయాణ ప్లాన్‌పై స్పష్టత లేకపోతే విమాన ప్రయాణ టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడే దానికి ఇన్సూరెన్స్ ఎంచుకోవాలి. ఫ్లయిట్ ఇన్సూరెన్స్ కోసం భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ, క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కింద పూర్తిగా టికెట్ కొనుగోలు చార్జీలు రీఫండ్ చేసుకునేందుకు అర్హులు. ఒక చోటకు వెళ్లాలన్న విషయమై స్పష్టత లేనప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది సుమా. ఈ ఆప్షన్ ఎంచుకోవడానికి నిర్దిష్ట ప్రామాణిక నిబంధనలేం లేవు. ఫ్లయిట్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు టర్మ్స్, కండీషన్స్ తప్పక చదువుకోవాల్సి ఉంటుంది.
టికెట్ బుక్ చేసిన 24 గంటల్లో క్యాన్సిల్ చేసుకుంటేనే..
ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్లాలనుకున్నారనుకుందాం.. చివరిక్షణంలో దుబాయ్‌కి వెళ్లే పని వాయిదా వేయాల్సి వస్తే, అప్పటికే బుక్‌చేసుకున్న విమాన ప్రయాణ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు తొలుత టికెట్ బుక్ చేసుకున్న వెబ్సైట్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి.. టికెట్ చార్జీ రీఫండ్ కోసం విజ్ఞప్తి చేయాలి. కొన్ని వెబ్సైట్లు.. టికెట్ క్యాన్సిలేషన్ కోసం చార్జీలు చెల్లించాలని కోరొచ్చు. కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం మీరు వారం రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే, బుక్ చేసిన 24 గంటల్లో ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తిగా రీఫండ్ అవుతుంది. అయితే, టికెట్ బుక్ చేసుకోవడానికి ముందే సంబంధిత ఎయిర్‌లైన్స్.. టికెట్ క్యాన్సిలేషన్, రీఫంఢ్ పాలసీ గురించి క్షుణ్ణంగా చదువుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల అనూహ్య చార్జీల నుంచి తప్పించుకోవచ్చు.
మెడికల్ ఎమర్జెన్సీకి రీఫండ్.. కొన్ని ఎయిర్‌లైన్స్‌లో రీషెడ్యూలింగ్
వివిధ విమానయాన సంస్థలకు విమాన టికెట్ల క్యాన్సిలేషన్, రీఫండ్ విషయంలో విభిన్నమైన నియమ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి గోఫస్ట్ విమానంలో వెళ్లి, ఎయిర్ ఇండియా విమానంలో తిరిగొచ్చినా రెండు విమాన యాన సంస్థల మధ్య టికెట్ క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. మెడికల్ ఎమర్జెన్సీ వల్ల టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అందుకు సంబంధిత వైద్య పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పలు విమానయాన సంస్థలు టికెట్ క్యాన్సిలేషన్ కింద సొమ్ము రీఫండ్ చేయడానికి బదులు ఉచితంగా ప్రయాణం రీషెడ్యూల్ చేస్తుంటాయి. ఈ అంశంపై ఎల్లవేళలా టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ముందు సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు.
విమాన టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ కోసం ఇలా..
విమాన ప్రయాణానికి బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రీఫండ్ చేసుకోవాలంటే.. మీరు టికెట్ బుక్ చేసుకున్న వెబ్సైట్లోకి వెళ్లాలి. టికెట్ క్యాన్సిలేషన్ తర్వాత ప్రతిసారీ మనీ రీఫండ్ అయినా 100 శాతం బుకింగ్ ప్రైస్ రీఫండ్ కాదు. రీఫండ్ క్లయిమ్ కోసం మెడికల్ సర్టిఫికెట్లు, దవాఖాన నుంచి డిశ్చార్జి సమ్మరీ వంటి పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్‌ను రీషెడ్యూల్ చేస్తాయే గానీ, 100 శాతం రీఫండ్ చేయవు. అటువంటి సంస్థలు రీఫండ్‌కు బదులు ఉచితంగా రీ-షెడ్యూలింగ్ ఆప్షన్ ఎంచుకోమని కోరతాయి. టికెట్ క్యాన్సిలేషన్ తర్వాత మనీ రీఫండ్ ప్రక్రియ టైమ్ తీసుకుంటుంది. సరైన సమాచారం. పరిజ్ఞనం ఉంటే క్యాన్సిలేషన్ చార్జీలు తగ్గించుకుని పూర్తిగా రీఫండ్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణంపై అనిశ్చితి నెలకొన్నప్పుడు ఎయిర్‌లైన్స్ టికెట్ల క్యాన్సిలేషన్ పాలసీలను జాగ్రత్తగా చదివి, ఫ్లయిట్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

