How To Claim Vehicle Insurance : బండికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా?
How To Claim Vehicle Insurance వాహనాన్ని కొనుగోలు చేసిన వెంటనే దానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. సాధారణంగా కొన్నప్పుడే షోరూమ్‌లో బిల్లుతోపాటే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ తీసుకోవడంతోపాటే క్లెయిమ్ చేసే పద్ధతులనూ తెలుసుకోవడం ముఖ్యం
వాహనాన్ని కొనుగోలు చేసిన వెంటనే దానికి ఇన్సూరెన్స్ ( Vehicle Insurance ) తీసుకోవడం తప్పనిసరి. సాధారణంగా కొన్నప్పుడే షోరూమ్‌లో బిల్లుతోపాటే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ తీసుకోవడంతోపాటే క్లెయిమ్ చేసే పద్ధతులనూ తెలుసుకోవడం ముఖ్యం .

క్లెయిమ్ రిజిస్ట్రేషన్
క్లెయిమ్ చేయాలంటే మొదటగా ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టల్‌లో ఆన్లైన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను నమోదు చేయాలి. పాలసీదారు, వాహనం, డ్రైవర్, జరిగిన ప్రమాదం, పోలీస్ స్టేషన్లో కేసు, ప్రమాద వివరాలను, పాలసీదారు బ్యాంకు వివరాలను పేర్కొనాలి. ఒకవేళ వాహన ఇంజిన్ లేదా ప్రధాన విడిభాగాల రిపేర్, రీప్లేస్‌మెంట్‌కు సంబంధించిన క్లెయిమైతే పోలీస్ స్టేషన్ వివరాలు అవసరం లేదు.
డాక్యుమెంట్లు
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే పాలసీ డాక్యుమెంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, రిపేరింగ్ బిల్లులు, కేవైసీ వివరాలతోపాటు యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ కాపీని అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం దొంగతనానికి గురైతే ఇన్వెస్టిగేషన్ నివేదిక, సర్వీస్ బుక్లెట్, వారంటీ కార్డులు సమర్పించాల్సి ఉంటుంది.
రిపేర్
యాక్సిడెంట్ జరిగిన వెంటనే రిపేరింగ్ కోసం గ్యారేజీకి తీసుకెళ్లాలి. రిపేరింగ్ అయిన మొత్తానికి సంబంధించిన బిల్లులను జతచేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయాలి.
సర్వే
క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన సర్వేయర్ వాహనానికి జరిగిన నష్టాన్ని సర్వే చేసి అంచనా వేస్తారు. అందుకయ్యే రిపేరింగ్ ఖర్చులపై ఒక రోజులోగా ఆమోదం తెలుపుతారు. ఇంకా ఎక్కువ ఖర్చుంటే దాన్ని పాలసీదారే భరించాలి.
క్లెయిమ్ బోనస్
ఒకసారి ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేస్తే తదుపరి రెన్యూవల్లో క్లెయిమ్ బోనస్‌కు అర్హత కోల్పోతారు.
బీమాతోనే బతుకు భద్రం
జీవిత బీమా, ఆరోగ్య బీమా అందరికీ అనివార్యమైపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విపత్కర పరిస్థితుల్లో ఉన్న మనకు బీమాతోనే భద్రం ఇప్పుడు. అనారోగ్యం పాలైనా.. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయినా బాధితులకు ఆర్థిక భద్రతను కల్పించడంలో ఈ రెండింటిదే ప్రధాన పాత్ర. జీవిత బీమా డెత్ బెనిఫిట్‌పై ఆదాయం పన్ను ఉండదు. జీవిత బీమాలో హోల్ లైఫ్, యూనివర్సల్ లైఫ్ అని రెండు రకాలుంటాయి. ఇక ఆరోగ్య బీమా పాలసీలు ప్రధానంగా మూడు రకాలు. వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్, సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా. వీలైనంత త్వరగా మెరుగైన బీమా పాలసీలను తీసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలను పొందవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

