Honor X50 | భారీ కెపాసిటీ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్ హానర్ ఎక్స్50.. 5న ఆవిష్కరణ..?!
Honor X50 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్.. భారత్ మార్కెట్లో బడ్జెట్ ధరకే హానర్ ఎక్స్ 50 మోడల్ ఫోన్ తెస్తున్నది. ఈ నెల ఏడో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు.
Honor X50 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ తీసుకొస్తున్నది. గతేడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించిన హానర్ ఎక్స్50 ఫోన్ ఈ నెల ఐదో తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్‌తోపాటు అతిపెద్ద 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 35 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. 12 జీబీ రామ్ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13-బేస్డ్ మ్యాజిక్ యూఐ 7.1 వర్షన్ మీద పని చేస్తుందని చెబుతున్నారు.
హానర్ ఎక్స్50 స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల 1.5 కే (2400×1220 పిక్సెల్స్) రిజొల్యూషన్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సర్‌తోపాటు 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుందని వార్తలొచ్చాయి. భారత్ మార్కెట్లో దాదాపు రూ.11,300 (1000 చైనా యువాన్లు) పలుకుతుందని తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే, ఇంతకుముందు మార్కెట్లోకి వచ్చిన హానర్ ఎక్స్40 ఫోన్ కైయున్ చేజింగ్ ది మూన్, మ్యాజిక్ నైట్ బ్లాక్, మో యుకింగ్ రంగు ఆప్షన్లలో లభిస్తున్నది. బేస్ 6 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.17,100 (1499 చైనా యువాన్లు) లకు లభిస్తుంది.
8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రమారమీ రూ.19,400 (1699 చైనా యువాన్లు), హయ్యర్ ఎండ్ 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.22,800 (1999 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.26,200 (2299 చైనా యువాన్లు) పలుకుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

