Honor 90 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హానర్’ తిరిగి భారత్ మార్కెట్లోకి ఎంటరయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న నూతన తరం ఫోన్ ‘హానర్90 5జీ’ ఫోన్ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు హానర్ గురువారం అధికారిక ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో ట్వీట్ చేసింది.
200-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తోంది. గత మే నెలలోనే చైనా మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచింగ్ ఈవెంట్ ప్రారంభం అవుతుందని హైటెక్ కంపెనీ తెలిపింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయని ధ్రువీకరించారు.
1.5కే రిజొల్యూషన్ టీయూవీ రయిన్లాండ్ సర్టిఫైడ్ డిస్ ప్లే, 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తున్నది హానర్ 90 5జీ ఫోన్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 7.1 వర్షన్‌పై పని చేస్తుంది. 200-మెగా పిక్సెల్స్ ట్రిపుల్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
చైనీస్ వేరియంట్ హానర్90 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1200×2664 పిక్సెల్స్) కర్వుడ్ ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్, 16 జీబీ ర్యామ్ తో గరిష్టంగా 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 66 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా ఉంటుంది.
గత మే నెలలో చైనాలో ఆవిష్కరించిన హానర్90 5జీ ఫోన్ బేస్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.29 వేల (2499 చైనా యువాన్లు)తో ప్రారంభం అవుతుంది. 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.32,680 (2799 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు రూ.35,017 (2999 చైనా యువాన్లు) పలుకుతుంది. భారత్ మార్కెట్లో ఫోన్ ధర రూ.35 వేల మధ్య ఉండొచ్చునని తెలుస్తున్నది. 2020 తర్వాత భారత్ మార్కెట్ నుంచి హానర్ వైదొలిగింది. ప్రస్తుతం హానర్ భారత్ ఆపరేషన్స్ హెడ్‌గా మాధవ్ సేథ్ (రియల్మీ మాజీ వైస్ ప్రెసిడెంట్) వ్యవహరిస్తారు.