Honda Livo |హోండా స్టయిలిష్ న్యూ బైక్ లివో ఆవిష్కరణ.. దీని ధరెంతంటే..?!
Honda Livo | దేశంలోని ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) .. దేశీయ మార్కెట్లోకి కొత్త లైవ్ బైక్ విడుదల చేసింది.
Honda Livo | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. దేశీయ మార్కెట్లోకి న్యూ బైక్ ‘లివో (Livo)’ తీసుకొచ్చింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,500 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. రెండోదశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఓబీడీ2-కంప్లియంట్ ఇంజిన్ రూపొందించారు. 110సీసీ సెగ్మెంట్లో బజాజ్ సీటీ110, బజాజ్ ప్లాటినా 110, హోండా సీడీ 110 డ్రీమ్, టీవీఎస్ రాడియన్, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోటారు సైకిళ్లతో హోండా లివో పోటీ పడుతుంది.
ఎంట్రీ లెవల్ హోండా లివో బైక్ డ్రమ్ అండ్ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. మూడేండ్ల స్టాండర్డ్, ఏడేండ్ల ఆప్షనల్ వారంటీ అందిస్తున్నది హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా.
న్యూ హోండా లివో మోటార్ సైకిల్ ఫ్రంట్‌లో హెడ్ ల్యాంప్స్, ఫ్యుయల్ ట్యాంక్ మీద న్యూ గ్రాఫిక్స్ వస్తాయి. హోండా లివో అత్యంత స్టయిలిష్‌గా ఉంటది. హోండా లియో 5-స్టెప్ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్, కాంబిబ్రేక్ సిస్టమ్ (సీబీఎస్) విత్ ఈక్వలైజర్ వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్, డీసీ హెడ్ ల్యాంప్, 675 ఎంఎం టాల్ సీట్, ట్యూబ్ లెస్ టైర్స్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు జత చేశారు.
హోండా లివో 109.5 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ విత్ ఫ్యుయల్ ఇంజెక్షన్ వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.5 హెచ్‌పీ విద్యుత్, 9.30 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 4-స్పీడ్ గేర్ బాక్స్, సైలెంట్ స్టార్ట్ కోసం ఏసీజీ స్టార్టర్ మోటార్ ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

