Honda – Shine 100 | ఏడాది లోపు మూడు లక్షల బైక్స్ సేల్స్.. హోండా షైన్ 100 రికార్డు..!
Honda - Shine 100 | ‘హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) పాపులర్ బైక్ షైన్100 ఆవిష్కరించిన ఏడాది లోపే మూడు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
Honda – Shine 100 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కీలక మైలురాయిని దాటింది. హోండా షైన్-100 (Honda Shine 100) మోటార్ సైకిల్ మార్కెట్లో ఎంటరైన ఏడాది లోపు మూడు లక్షలకు పైగా యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. ‘హోండా షైన్ 100’ తొలి వార్షికోత్సవం సందర్భంగా పలు నగరాల పరిధిలో మెగా డెలివరీ ఈవెంట్ నిర్వహించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమ 100-110 సీసీ సెగ్మెంట్లో నమ్మశక్యం కానీ గ్రోత్ సాధించినట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తెలిపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో కలిపి 6000కి పైగా టచ్ పాయింట్లలో హోండా మోటార్ సైకిల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
హోండా షైన్ 100 మోటారు సైకిల్.. న్యూ 100 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. బీఎస్-6 ఆర్డీఈ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది. ఆటో చూక్ సిస్టమ్ తో వస్తున్న ఫ్యూయల్ ట్యాంక్ బయట ఫ్యుయల్ పంప్ ఉంటుంది. ఈ ఇంజిన్ 7500 ఆర్పీఎం వద్ద 7.5 బీహెచ్పీ, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
హోండా షైన్ 100 మోటారు సైకిల్ ఆరేండ్ల స్పెషల్ వారంటీ ప్యాకేజీ (మూడేండ్లు స్టాండర్డ్, మూడేండ్ల ఆప్షనల్ వారంటీ) అందిస్తోంది. కాంబీ బ్రేక్ సిస్టమ్ (సీబీఎస్), ఈక్విలైజర్తోపాటు 786 ఎంఎం ఎత్తుగల సీట్ ఉంటుంది. చూడటానికి షైన్ 125 స్మాలర్ వర్షన్ మోటారు సైకిల్ మాదిరిగా షైన్ 100 బైక్ కనిపిస్తుంది. ఐదు రంగుల్లో షైన్ 100 లభిస్తుంది. ఫ్రంట్ కౌల్, బ్లాక్డ్ ఔట్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం గ్రాబ్ రెయిల్, స్లీక్, మఫ్లియర్, రెడ్ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, బ్లూ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, గ్రీన్ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, గోల్డ్ స్ట్రైప్స్ తోపాటు బ్లాక్, గ్రే స్ట్రైప్స్ తోపాటు బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

