Honda CB300R Bikes Recall | 2000 సీబీ300ఆర్ బైక్‌లు రీకాల్ చేసిన హోండా.. కారణం అదేనా?!
Honda CB300R Bikes Recall | హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్.. తన సీబీ300ఆర్ బైక్స్ ఇంజిన్‌లో లోపాల కారణంగా దాదాపు 2000 బైక్‌లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉచితంగా రీప్లేస్ చేస్తామని శనివారం తెలిపింది.
Honda CB300R Bikes Recall | ఇంజిన్‌లో లోపాల కారణంగా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దాదాపు 2000 `సీబీ300 ఆర్ (CB300R) స్పోర్ట్స్ కేఫ్ రేసర్ బైక్‌లు రీకాల్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. గతేడాది మార్కెట్లో ఆవిష్కరించిన సీబీ300ఆర్ (CB300R) బైక్‌లు కూడా రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఇంజిన్‌లో లోపాలతోపాటు అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. ఇంజిన్‌కు కుడివైపు క్రాంక్కేస్ కవర్ తయారీలో లోపం తలెత్తిందని గుర్తించినట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. సీబీ300 ఆర్ -2022 మోడల్ బైక్ స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది.
పరిస్థితులు విషమిస్తే మోటారు సైకిల్లో వేడెక్కిన విడి భాగాల్లో మంటలు రావడానికి ఆయిల్ కారణం అవుతున్నట్లు గుర్తించారు. వేడి ఉష్ణోగ్రతల వల్ల టైర్లు స్లిప్ అయి, దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తులు గాయపడే అవకాశం ఉందని గుర్తించినట్లు హెచ్ఎంఎస్ఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న సీబీ300ఆర్ బైక్‌ల విడి భాగాలను రీప్లేస్ చేయాలని ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ నెల 15 నుంచి బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద సదరు బైక్‌ల్లో విడి భాగాల రీప్లేస్ మొదలవుతుందని పేర్కొంది. బైక్ వారంటీతో సంబంధం లేకుండా ఉచితంగానే రీప్లేస్ చేస్తామని తెలిపింది.
కస్టమర్లు తమ వాహనాలను పరీక్షించుకునేందుకు రావాలని ఫోన్ ద్వారా గానీ, ఈ-మెయిల్ ద్వారా గానీ, ఎస్ఎంఎస్ల ద్వారా గానీ బిగ్‌వింగ్ డీలర్లు నోటిఫై చేస్తారని హెచ్ఎంఎస్ఐ పేర్కొంది. గతేడాది జనవరిలో హెచ్ఎంఎస్ఐ.. స్పోర్టీ లుక్‌తో ఉన్న న్యూ బైక్ సీబీ300ఆర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.2.77 లక్షలుగా నిర్ణయించింది. సీబీ300ఆర్ బైక్ 286సీసీ 4-వాల్వ్ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

