Hero Moto Vs Honda | హీరో మోటోకు హోండా షాక్.. అదేమిటంటే?!
Hero Moto Vs Honda | సెప్టెంబర్ సేల్స్‌లో హీరో మోటో కార్ప్ వెనుకబడింది. హోండా బైక్స్, స్కూటర్స్ పై చేయి సాధించడం ఇదే ఫస్ట్‌టైం.
Hero Moto Vs Honda | ఇప్పటి వరకు దేశంలో టూ వీలర్స్ మార్కెట్లో పవన్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటో కార్ప్దే పై చేయి. కానీ పరిస్థితులు తారుమారవుతున్నట్లు కనిపిస్తున్నది. గత నెలలో జరిగిన మోటార్ బైక్స్, స్కూటర్ల సేల్స్‌లో హీరో మోటో కార్ప్‌ను హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దాటేసింది. ప్రపంచవ్యాప్తంగానే అత్యధికంగా బైక్స్, స్కూటర్లు అమ్ముడైన సంస్థ హీరో మోటో చరిత్రలో తొలిసారి వెనుక బడింది. కేంద్ర ప్రభుత్వ రవాణాశాఖ వెబ్సైట్ వాహన్ విడుదల చేసిన టూ వీలర్స్ రిటైల్ సేల్స్ గణాంకాలు ఈ సంగతి చెబుతున్నాయి.
సెప్టెంబర్‌లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఎల్) 2,85,400 బైక్స్, స్కూటర్లు విక్రయిస్తే.. హీరో మోటో కార్ప్ 2,51,939 యూనిట్లకు పరిమితమైంది. రెండు సంస్థల మధ్య 33,461 బైక్స్ అండ్ స్కూటర్స్ తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, లక్ష్యద్వీప్, తెలంగాణ మినహా దేశంలోని 1441 ఆర్టీవోలకు 1339 ఆర్టీవోల పరిధిలో వాహనాల సేల్స్.. వాహన్ వెబ్సైట్లో అప్డేట్ అవుతాయి.
హోండాలో యాక్టీవా.. హీరో స్ప్లెండర్ పోటాపోటీ
ఇప్పటి వరకు దేశీయ టూ వీలర్స్ మార్కెట్లో హీరో మోటో కార్ప్దే పెత్తనం. సెప్టెంబర్‌లో మాత్రం హీరో మోటోను హెచ్ఎంఎస్ఎల్ దాటేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి టూ వీలర్స్ సేల్స్ గమనిస్తే.. గత మే నెలలో రెండు సంస్థల మధ్య తేడా 1,70,757 యూనిట్లు ఉంటే.. తర్వాత ఆ వ్యత్యాసం క్రమంగా తగ్గిపోయింది. జూన్‌లో లక్ష దిగువకు, జూలైలో 53,356, ఆగస్టులో 20,658 యూనిట్లకు దిగి వచ్చింది.
హీరో మోటో కార్స్, హోండా బైక్స్ స్కూటర్స్ సేల్స్‌లో తేడా ఇలా
నెల ————- హీరో మోటో——- హెచ్ఎంఎస్ఎల్ — తేడా
ఏప్రిల్ ———- 4,14,649 ———- 2,95,079 ———– 1,19,570
మే————— 4,62,618 ———- 2,91,861 ———– 1,70,757
జూన్ ———— 3,85,132 ———- 2,86,074 ———- 99,058
జూలై ———— 3,26,656 ——— 2,73,300 ———- 53,356
ఆగస్టు ———– 3,04,713 ——— 2,84,145 ———– 20,568
సెప్టెంబర్ ——- 2,51,939 ——— 2,85,400 ———- -33,461
సెప్టెంబర్ నెల టూ వీలర్స్ సేల్స్‌లో హీరో వెనక బడింది. గతేడాదితో పోలిస్తే హీరో మోటో సేల్స్ దాదాపు రెండు శాతం తగ్గాయి. హీరో బైక్స్ అండ్ స్కూటర్స్ సేల్స్ ఇప్పటివరకు 5,19,980 యూనిట్లు. దేశీయంగా 5,07,690 బైక్స్, స్కూటర్లు విక్రయిస్తే విదేశాలకు ఎగుమతులు దాదాపు 50 శాతం తగ్గి 12,290 యూనిట్లతో సరిపెట్టుకుంది. గత నెలలో హీరో బైక్స్ 4,80,237 విక్రయిస్తే.. 2021లో 4,89,217 యూనిట్లు సేల్ అయ్యాయి. స్కూటర్ల సేల్స్ స్వల్పంగా 40,929 యూనిట్ల నుంచి 39,743 యూనిట్లకు తగ్గాయి. హోండా టూ వీలర్స్ హోల్‌సేల్ విక్రయాల డేటా ఇంకా వెల్లడి కాలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

