Honda Elevate | త్వరలో మార్కెట్లోకి హోండా ఎలివేట్ ఎస్యూవీ.. క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ గ్యారంటీ
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా.. భారత్ మార్కెట్లోకి మరో ఎస్ యూవీ కారు ఎలివేట్ తేనున్నది. దీని ధర రూ.10.50 లక్షలుండొచ్చు. ఈ కారు వచ్చే ఫెస్టివ్ సీజన్ లో మార్కెట్లో అందుబాటులోకి రానున్నది.
Honda Elevate | భారతీయుల్లో ఎస్యూవీ కార్లపై మోజును సొమ్ము చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలన్నీ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా ఇండియా త్వరలో తన మిడ్ సైజ్ ఎస్యూవీ సెల్టోస్ అప్డేట్ వర్షన్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి రాబోతున్నది. అదే బాటలో జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ సైతం వడివడిగా దూసుకొస్తున్నది. హోండా ఎలివేట్ (Honda Elevate) సైతం త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలో హోండా ఎలివేట్ అనధికార ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.21 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నా వందశాతం రూ.21 వేలు రీఫండ్ చేస్తామని హోండా కార్స్ డీలర్స్ హామీ ఇస్తున్నారు. అధికారికంగా ఒకటి, రెండు రోజుల్లో ఎలివేట్ కార్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
వచ్చేనెల నుంచి హోండా డీలర్ షిప్‌ల వద్ద హోండా ఎలివేట్ (Honda Elevate) డిస్ ప్లే చేస్తారు. త్వరలో ప్రారంభం కానున్న ఫెస్టివ్ సీజన్లో.. ఆగస్టు నెలాఖరులో గానీ, సెప్టెంబర్ మొదటి వారంలో గానీ డెలివరీ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. దీని ధర రూ.10.50 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య పలుకుతుందని తెలుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లోకి హోండా ఎలివేట్ గత నెల ఆరో తేదీన ఎంటరైంది.
ఎలివేట్ తో ప్రారంభించి.. 2030 నాటికి భారత్ మార్కెట్లో ఐదు ఎస్యూవీ కార్లను హోండా ఆవిష్కరించనున్నది. మరో మూడేండ్లలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ) ఎలివేట్ కూడా మార్కెట్లోకి ఎంటర్ కానున్నది.
హోండా ఎలివేట్ 1.5 లీటర్ల -ఐ-వీటెక్ డీఓహెచ్సీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 121 పీఎస్ విద్యుత్, 145 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది.
హోండా ఎలివేట్ కారు ఎల్ఈడీ హెడ్ లైట్స్ అండ్ టెయిల్ లైట్స్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 7-అంగుళాల హెచ్డీ కలర్డ్ టీఎఫ్టీ ఎంఐడీ, 10.25 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆటోమేటిక్ కంట్రోల్, హోండా సెన్సింగ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఫీచర్లు కూడా ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

