Honda Elevate SUV | 4న హోండా ఎలివేట్ లాంచింగ్.. ధరల వివరాలివి..?!
Honda Elevate SUV | జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. భారత్ మార్కెట్లో కంపాక్ట్ ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో పోటీ పడనున్నది. సోమవారం తన ఎలివేట్ ఎస్యూవీ కారు ఆవిష్కరించనున్నది.
Honda Elevate SUV | ఇప్పుడు ప్రతి ఒక్కరూ కంపాక్ట్ ఎస్యూవీ కార్లపై క్రేజ్ పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ (Honda Cars) సైతం కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి ఎంటరయ్యేందుకు సిద్ధమైంది. హోండా కార్స్ తన ఎలివేట్ ఎస్యూవీ (Elevate SUV) కారు సోమవారం ఆవిష్కరించనున్నది. దీని ధర కూడా వెల్లడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలైలోనే ఎలివేట్ (Elevate SUV) కోసం ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆన్లైన్లో రూ.5,000, ఏదేనీ హోండా డీలర్ ఔట్ లెట్ వద్ద రూ.21 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. ధర వెల్లడించిన తర్వాత సోమవారం నుంచే కార్ల డెలివరీ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
భారత్ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా హోండా కార్స్ తన హోండా ఎలివేట్ ఎస్‌యూవీని డిజైన్ చేసింది. ఈ కారు నాలుగు వేరియంట్లు – ఎస్వీ, వీ, వీఎక్స్, జడ్ఎక్స్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభంలో ఏడు సింగిల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్లాటినం వైట్ పెరల్, లునార్ సిల్వర్ మెటాలిక్, ఒబ్సిడియన్ బ్లూ పెరల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మీటరాయిడ్ గ్రే మెటాలిక్, ఫోనిక్ ఆరెంజ్ పెరల్ రంగుల్లో లభిస్తుంది.
టాప్ ఎండ్ వేరియంట్లు -ఫోనిక్స్ ఆరెంజ్ పెరల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెరల్ రూఫ్, ప్లాటినం వైట్ పెరల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెరల్ రూఫ్, రేడియంట్ రెడ్ మెటాలిక్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెరల్ రూఫ్ మోడల్ కార్లు త్రీ డ్యుయల్ టోన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
బాక్సీ ఫ్రంట్ ప్రొఫైల్‌తో ఎలివేట్ ఎస్యూవీ వస్తుంది. ఈ కారులో లార్జ్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్లె, ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, బ్లాక్ ఫాగ్ లాంప్ హౌసింగ్, లార్జ్ వీల్ అర్చెస్ హౌసింగ్ స్పోర్టీ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఇంకా 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కంపాటిబుల్ విత్ వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, 7-అంగుళాల హెచ్డీ కలర్ టీఎఫ్టీ డ్రైవర్ డిస్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత చేశారు.
హోండా సిటీ సెడాన్‌లో మాదిరిగా 1.5 లీటర్ల డీవోహెచ్సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 119 బీహెచ్పీ విద్యుత్, 145.1 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా అడ్వాన్స్డ్ సీవీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌పై 15.31 కి.మీ, సీవీటీ వర్షన్ 16.92 కి.మీ మైలేజీ ఇస్తుంది.
సుదీర్ఘ విరామం తర్వాత హోండా కార్స్ .. ఎలివేట్ ఆవిష్కరణతో ఎస్యూవీ సెగ్మెంట్లోకి ఎంటరవుతున్నది. మారుతిసుజుకి గ్రాండ్ విటారా, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ఎస్యూవీ కార్లతో పోటీ పడుతుందని చెబుతున్నారు. ఈ కార్ల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. హోండా ఎలివేట్ కారు ధర సుమారు రూ.10 లక్షలు (ఎక్స్ షోరూమ్).. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.18 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉండొచ్చునని భావిస్తు్న్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

