Honda Elevate | హైదరాబాద్‌లో 100 హోండా ఎలివేట్ కార్ల డెలివరీ.. !
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ ఎలివేట్ కార్లు డెలివరీ చేసింది. 100 మంది కస్టమర్లకు కార్లు అందించింది.
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ కొత్తగా మార్కెట్లో విడుదల చేసిన మిడ్ సైజ్ ఎస్యూవీ కారు ఎలివేట్ డెలివరీ చేసింది. హైదరాబాద్‌లో శనివారం 100 మంది కస్టమర్లకు ఎలివేట్ కార్లను డెలివరీ చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో మున్ముందు మెగా డెలివరీ ఈవెంట్ నిర్వహిస్తామని హోండా కార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యుయిచి మురతా చెప్పారు.

తమ కస్టమర్లకు ఎలివేట్ ఎస్యూవీ కార్లు డెలివరీ చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు యుయిచి మురతా చెప్పారు. ఎలివేట్ రాకతో ఎస్యూవీ సెగ్మెంట్లో హోండా కార్స్ శక్తిమంతంగా దూసుకెళ్తుందన్నారు. తమ హోండా ఎలివేట్ వినియోగదారులందరినీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కారు ధర రూ.10,99,900 నుంచి రూ.15,99,900 (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.

హోండా ఎలివేట్ `అర్భన్ ఫ్రీ స్టయిలర్` కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్నది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. శక్తిమంతమైన 1.5 లీటర్ల ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. సేఫ్టీ కోసం అడాస్ ఫీచర్లతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. నాలుగు గ్రేడ్లు, పది కలర్ కాంబినేషన్లలో అందుబాటులో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

