న్యూఢిల్లీ, అక్టోబర్ 6: హోండా కార్స్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో కారును కొనుగోలు చేసిన వారికి రూ.53,500 వరకు ప్రయోజనాలు కల్పించనున్నది. కంపెనీకి చెందిన పలు మోడళ్ళను కొనుగోలు చేసిన వారికి నగదు రాయితీ, విడిభాగాలు, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్సేంజ్ ప్రయోజనాలు అందిస్తున్నది సంస్థ. వీటిలో 5వ జనరేషన్ హోండా సిటీపై రూ.53,500, 4వ జనరేషన్ సిటీపై రూ.22 వేలు, అమేజ్‌పై రూ.18 వేల వరకు, డబ్ల్యూఆర్-వీపై రూ.40 వేల వరకు, జాజ్‌పై రూ.46 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది.