న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో 2021 హోండా అమేజ్ ఫేస్‌లిప్ట్ మోడల్‌ను లాంఛ్ చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు రూ 6.32 లక్షల నుంచి రూ 11.15 లక్షల మధ్య అందుబాటులో ఉంది. అమేజ్ ఫేస్‌లిఫ్ట్ 2021 పలు అత్యాధునిక ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అప్డేట్స్తో వాహనదారులను ఆకట్టుకోనుంది.
ముందుభాగంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రియర్ సైడ్ సీ ఆకారంతో కూడిన ఎల్ఈడీ కాంబినేషన్ ల్యాంప్స్, టచ్ సెన్సార్ స్మార్ట్ ఎంట్రీ సిస్టంతో కూడిన న్యూ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, 15 ఇంచ్ డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, లునార్ సిల్వర్ మెటాలిక్, మెటరాయిడ్ గ్రే వంటి పంచ రంగుల్లో అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ఆకట్టుకోనుంది.
న్యూ అమేజ్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌లోనూ పలు అప్గ్రేడ్లు వాహనదారులను అలరించనున్నాయి. ఏడు అంగుళాల డిజిపాడ్ 2.0 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో వెబ్‌లింక్ వంటి ఇంటీరియర్స్‌తో అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ముస్తాబైంది. ఇక న్యూ హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ఈ, ఎస్, వీఎక్స్ వంటి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.