Honda Motor Cycles | త్వరలో దేశీయ మార్కెట్లోకి హోండా మోటార్ సైకిల్.. స్కూటర్..!
Honda Motor Cycles | వచ్చే త్రైమాసికంలో హోండా మోటార్ సైకిల్స్.. 160సీసీ బైక్, 125 సీసీ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి తెస్తున్నట్లు సంస్థ సీఈవో అతుషి ఒగటా తెలిపారు.
Honda Motor Cycles | హోండా మోటార్ సైకిల్స్.. యాక్టీవా.. అందరికీ ఎంతో ఇష్టమైన బైక్స్, స్కూటర్లు.. వాటిని తయారీ చేస్తున్న హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దూకుడుగా భారత్ మార్కెట్లో వాటా పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్.. మూడు ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) మోడల్ బైక్‌లు, స్కూటర్లు ఆవిష్కరించనున్నది. ఈసీఈ క్యాటగిరీలో వచ్చే త్రైమాసికంలో 160సీసీ మోటార్ సైకిల్, 125 సీసీ స్కూటర్ మార్కెట్లోకి తెస్తున్నది. వచ్చే నవంబర్‌లో 350సీసీ మోటార్ సైకిల్ ఆవిష్కరిస్తామని హెచ్ఎంఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈవో అతుషి ఒగాటా వెల్లడించారు.
మిడ్ రేంజ్ ఫిక్స్డ్ బ్యాటరీ స్కూటర్, స్వాపబుల్ టైప్ వెహికల్స్‌తో కలిపి `విద్యుత్` ప్రాజెక్ట్ కింద రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్లోకి తెస్తున్నామని అతుషి ఒగాటా చెప్పారు. 2030 నాటికి విభిన్న బాడీ స్టయిల్స్‌లో పలు న్యూ ఈవీ మోడల్స్ మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కోసమే కర్ణాటకలోని నర్సాపురలో `హైలెవెల్ ఆటోమేషన్`తో పూర్తి మౌలిక వసతులతో `ఫ్యాక్టరీ-ఈ` అసెంబ్లింగ్ యూనిట్‌ను నిర్మిస్తున్నట్లు అతుషి ఒగాటా తెలిపారు. ప్రారంభ దశలో ఏటా ఆరు లక్షల యూనిట్ల నుంచి 2030 నాటికి దశల వారీగా విస్తరిస్తూ 10 లక్షల యూనిట్లకు పెంచుతామన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో నాలుగు లేన్లలో యాక్టీవా స్కూటర్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. యాక్టీవా స్కూటర్ల ఉత్పత్తిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంట్‌కు తరలించడంతోపాటు మరో ఆరు లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తామన్నారు.
ఈవీ-కమ్యూటర్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని అతుషి ఒగాటా చెప్పారు. నేవీ కాన్సెప్ట్‌తో స్పోర్టీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా తయారు చేసిన బ్యాటరీలు, పవర్ కంట్రోల్ యూనిట్స్ (పీసీయూ)తో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తామన్నారు. ఈవీ మోటార్ పూర్తిగా హోండా డిజైన్ చేసి ఉత్పత్తి చేస్తుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

