Petrol into GST | జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్.. ఎందుకాలస్యమౌతున్నది..?!
Petrol into GST | కేంద్ర, రాష్ట్రాలకు ప్రధాన వనరు చమురే.. జీఎస్టీలోకి వాటిని తేవడం ఆలస్యానికి కారణమని కేంద్రం తెలిపింది.
Petrol into GST | పెట్రోల్, డీజిల్ సహా చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ముడి చమురు సంబంధ పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితరాలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో ప్రధాన భాగం. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే కొన్ని ఆందోళనలు ఉన్నాయని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. సోమవారం అసోచామ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తరుణ్ బజాజ్ మాట్లాడారు. తొలి నుంచి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
జీఎస్టీ అమలు ప్రారంభమై ఐదేండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వివిధ వస్తువులు, సేవలపై జీఎస్టీ హేతుబద్ధీకరణ, ఆత్మ శోధనపై జరిగిన చర్చాగోష్టిలో తరుణ్ బజాజ్ మాట్లాడుతూ విలాస వస్తువులు, హానికర వస్తువుల ( sin goods ) పై భవిష్యత్‌లోనూ 28 శాతం జీఎస్టీని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నదన్నారు. ఆయా ఉత్పత్తులను 5,12,18 లేదా రెండు శ్లాబ్‌ల పరిధిలోకి తెచ్చే విషయమై చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయన్నారు.
అయితే, లగ్జరీ, హానికర వస్తువుల్లో ఏయే వస్తువులపై 5,12,18 శాతం శ్లాబ్‌లు ఉండాలి. వేటిపై రెండు శ్లాబ్‌లు అమలు చేయాలి. దేశ వృద్ధిరేటు ఎలా.. ఎక్కడ ఒకే శ్లాబ్‌లోకి పన్నురేట్లు తేవాలి.. ఇది చాలా క్లిష్టమైన సవాల్` అని తరుణ్ బజాజ్ చెప్పారు. రోజువారీ నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్ను మినహాయింపు లేదా కనిష్టంగా ఐదు శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై అత్యధికంగా 28 శాతం పన్ను విధిస్తున్నారు. 12, 18 శాతం శ్లాబ్‌లు కూడా ఉన్నాయి. ఇక బంగారం, బంగారం ఆభరణాలు, అరుదైన లోహాలపై ప్రత్యేకంగా మూడు శాతం, పాలిష్డ్ అండ్ కట్ డైమండ్స్‌పై 1.5 శాతం టాక్స్ వసూలు చేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

