డెడ్‌లైన్ ఈ నెలాఖరే
ఈ నెలాఖరుకల్లా పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టం చేసింది. మే 31లోగా ట్యాక్స్‌పేయర్స్ తమ ఆధార్-పాన్‌ను లింక్ చేసుకోకపోతే జూన్ 1 నుంచి టీడీఎస్ అధిక రేటుతో కట్ అవుతుందని హెచ్చరించింది.
- మే 31కల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం కాకపోతే అధిక టీడీఎస్ కోతలు
- ట్యాక్స్పేయర్స్ను హెచ్చరించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ, మే 28: ఈ నెలాఖరుకల్లా పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టం చేసింది. మే 31లోగా ట్యాక్స్‌పేయర్స్ తమ ఆధార్-పాన్‌ను లింక్ చేసుకోకపోతే జూన్ 1 నుంచి టీడీఎస్ అధిక రేటుతో కట్ అవుతుందని హెచ్చరించింది. కనుక అధిక పన్ను కోతల నుంచి తప్పించుకోవాలంటే ఈ శుక్రవారంలోపు ఆధార్‌తో పాన్ లింకయ్యేలా చూసుకోవాలని కోరింది.
ఐటీ నిబంధనల ప్రకారం ట్యాక్స్‌పేయర్స్‌కు చెందిన పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్), బయోమెట్రిక్ ఆధార్‌తో అనుసంధానం జరుగకపోతే అందరికీ వర్తించే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) రేటుకు రెట్టింపు స్థాయిలో పన్ను కోతలుంటాయి.
కాగా, గత నెల ఏప్రిల్‌లోనే మే 31కల్లా ఆధార్‌తో పాన్‌ను పన్ను చెల్లింపుదారులు జత చేసినైట్టెతే టీడీఎస్ షార్ట్ డిడక్షన్‌కు ఎలాంటి చర్యలు ఉండబోవని కూడా ఐటీ శాఖ ఓ సర్క్యులర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ‘దయచేసి మీ పాన్‌తో మీ ఆధార్‌ను ఈ నెల 31లోగా లింక్ చేసుకోండి. ఇలా చేసుకోకపోతే రెట్టింపు రేటుతో టీడీఎస్‌ను చెల్లించాల్సి వస్తుంది’ అని ఐటీ శాఖ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఎస్ఎఫ్టీ గడువుపై..
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు, ఫారెక్స్ డీలర్లు, సబ్-రిజిస్ట్రార్, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్ల జారీదారులు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, డివిడెండ్లు చెల్లించే కంపెనీలు, షేర్లను బైబ్యాక్ చేస్తున్న సంస్థలు మే 31కల్లా స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్ (ఎస్ఎఫ్టీ) రిటర్న్స్‌ను దాఖలు చేయాలని మరో ‘ఎక్స్’ పోస్ట్‌లో ఐటీ శాఖ కోరింది. లేకపోతే జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. గడువు దాటితే రోజుకు రూ.1,000 చొప్పున ఫైన్ పడుతుందని హెచ్చరించింది. కాగా, ఎస్ఎఫ్టీలతో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను జరిపే వ్యక్తులపై ఐటీ శాఖ దృష్టి సారించడానికి వీలుంటుంది. తద్వారా పన్ను ఎగవేతలను అరికడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- aadhaar
- PAN
- PAN Aadhaar Link
- TDS
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

