Hero MotoCorp Vida V1 Pro | విదా వీ1 ఈవీ స్కూటర్ కాస్ట్లీ.. ధరెంత పెరిగిందంటే..?!
Hero MotoCorp Vida V1 Pro | ఫేమ్-2 సబ్సిడీ తగ్గించడంతో మిగతా సంస్థల బాటలో హీరో మోటో కార్ప్ పయనిస్తున్నది. ఆ సంస్థ ఈవీ స్కూటర్ విదా వీ1 ప్రో ధర దాదాపు రూ.6000 పెరిగింది.
Hero MotoCorp Vida V1 Pro | హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విదా వీ1 ప్రో (Vida V1 Pro)` ధర పెంచేసింది. కేంద్రం ఫేమ్-2 కింద టూ వీలర్స్‌కు సబ్సిడీ తగ్గించిన నేపథ్యంలో విదా వీ1 ప్రో స్కూటర్ మీద సుమారు రూ.6000 ధర పెంచుతున్నట్లు హీరో మోటో కార్ప్ ప్రకటించింది.
దీని ప్రకారం విదా వీ1 ప్రో (Vida V1 Pro) ధర రూ.1,45,900 పలుకుతుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, వడోదర నగరాల పరిధిలో రూ.1,25,900లకే అందుబాటులో ఉంటుంది. పోర్టబుల్ చార్జర్‌తోపాటు ఫేమ్-2 సబ్సిడీ కలుపుకునే ఈ స్కూటర్ ధర కలిపి ఉంటుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు ఫేమ్-2 కింద అందిస్తున్న సబ్సిడీని 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించేసింది కేంద్ర భారీ పరిశ్రమలశాఖ. దీని ప్రకారం ఒక్కో విద్యుత్ స్కూటర్‌కు ఒక కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్)కు రూ.15వేల సబ్సిడీని రూ.10 వేలకు పరిమితం చేశారు.
ఫలితంగా ఫేమ్-2 కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్న వారు దాదాపు రూ.32 వేలు సబ్సిడీ కోల్పోతున్నారు. దీంతో హీరో మోటో కార్ప్ ‘విదా` తన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విదా వీ1 ప్రో’ తయారీ ఖర్చులో గణనీయ భాగం భరిస్తున్నట్లు తెలిపింది. కొద్ది మొత్తం మాత్రమే వినియోగదారులపై మోపుతున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే హీరో మోటో కార్ప్ గ్రూప్ సంస్థ ‘హీరో ఎలక్ట్రిక్’ మాత్రం తమ ఈవీ స్కూటర్ల ధరలు పెంచడం లేదని తేల్చేసింది.
విదా వీ1 ప్రో స్కూటర్ 3.94 కిలోవాట్ల బ్యాటరీ కలిగి ఉంటుంది. 80 శాతం చార్జింగ్ కావడానికి 5.55 గంటల సమయం పడుతుంది. సింగిల్ చార్జింగ్‌తో 165 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 3.2 సెకన్లలో గరిష్టంగా 40 నుంచి 80 కి.మీ స్పీడ్ అందుకుంటుంది. 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ నిరంతరం 3.9 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్-2 కింద ఇస్తున్న సబ్సిడీలో కోత విధిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రకటించడంతో ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్ తమ ఈవీ స్కూటర్ల ధరలు పెంచేశాయి. తమ ఐ-క్యూబ్ స్కూటర్ రూ.17,000-22,000 మధ్య పెంచుతున్నట్లు టీవీఎస్ మోటార్స్ ప్రకటించింది. ఇంతకుముందు ఐక్యూబ్ రూ.1,06,384, ఐక్యూబ్ ఎస్ రూ.1,16,384 లకు లభించాయి.
ఏథర్ ఎనర్జీ తన 450 ఎక్స్ (ప్రో ప్యాక్) స్కూటర్ ధర రూ.8000 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం 450ఎక్స్ (ప్రో ప్యాక్) స్కూటర్ ధర రూ.1,65,435 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక మరో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా.. తన ఓలా ఎస్1 మోడల్ స్కూటర్ల ధరలు రూ.15 వేలు పెరిగాయి. ఓలా ఎస్1 ఎయిర్ (3కేడబ్ల్యూహెచ్) ధర రూ.1,09,999, ఎస్1 (3కేడబ్ల్యూహెచ్) రూ.1,29,999, ఎస్1 ప్రో రూ.1,39,999లకు లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

