Hero MotoCorp | హీరో మోటో ఈవీ టూ వీలర్ ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా?!
Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటో కార్ప్.. తన `విదా` ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.
Hero MotoCorp |దేశంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్ వచ్చేనెలలో ఈవీ సెగ్మెంట్లోకి ఎంటర్ కానున్నది. తన తొలి మోడల్ టూ వీలర్‌ను `విదా` బ్రాండ్ కింద మార్కెట్లోకి తేనున్నది. మొబిలిటీ రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం కానున్నదని హీరో మోటో కార్ప్ తన క్వార్టర్లీ రిపోర్ట్‌లో వెల్లడించింది. విదా బ్రాండ్ కింద తొలి ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నదని తెలిపింది. వచ్చే నెల ఏడో తేదీన తొలి వెహికల్‌ను ఆవిష్కరిస్తారు.
విదా బ్రాండ్ కింద మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆవిష్కరణ కార్యక్రమం భారీ స్థాయిలో చేపట్టింది హీరో మోటో కార్ప్. డీలర్లు, ఇన్వెస్టర్లు, గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్లకు ఈ మేరకు ఆహ్వానాలు పంపింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఈవీ టూవీలర్ ఆవిష్కరణ జరుగనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
తమ ఎలక్ట్రిక్ వెహికల్స్‌తోపాటు ఈఎస్జీ సొల్యూసన్స్ కోసం పదివేల మంది ఎంటర్ప్రెన్యూర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 760 కోట్ల గ్లోబల్ ఫండ్ కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో హీరో మోటో కార్ప్ ప్రకటించింది. జైపూర్ కేంద్రంగా పని చేస్తున్న ఆర్ అండ్ డీ హబ్‌లో విదా టూ వీలర్ డిజైన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ కేంద్రంగా పని చేస్తున్న ప్రొడక్షన్ యూనిట్లో ఈవీ టూ వీలర్‌ను ఉత్పత్తి చేయనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

