Hero Moto Corp | ఈవీ మార్కెట్ పై ఫోకస్.. మోటారుసైకిళ్లు. .ఈవీ స్కూటర్ల సెగ్మెంట్లో లీడర్.. ఇదీ హీరో మోటో కార్ప్ బ్లూ ప్రింట్..!
Hero Moto Corp | సంప్రదాయ టూ వీలర్స్ మార్కెట్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా ఈవీ టూ వీలర్స్ లో వెనుక బడింది హీరో మోటో కార్ప్. కానీ ఇప్పుడు తన మార్కెట్ వాటా పెంచుకునేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
Hero Moto Corp | ఏండ్లు.. దశాబ్దాల తరబడి సంప్రదాయ ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) బేస్డ్ టూ వీలర్స్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) ఎలక్ట్రిక్ వెహికిల్స్ సెగ్మెంట్ (Electric Vehicle)లో పూర్తిగా వెనుక బడి ఉంది. విదా వీ1 ప్రో (Vida V1 Pro) పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన హీరో మోటో కార్ప్.. ఈవీ పోర్ట్ ఫోలియోలో తమ వాటా పెంచుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్లో నాయకత్వ స్థానం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చౌక మోడల్ టూ వీలర్స్ ఆవిష్కరించాలని ప్రణాళిక రూపొందించిందని హీరో మోటో కార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా చెప్పారు. మధ్యమ శ్రేణి, చౌక శ్రేణి టూ వీలర్స్ ను ఆవిష్కరిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ బిజినెస్ లోకి శరవేగంగా దూసుకెళ్లేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. అందుకోసం అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరిస్తామని చెబుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సబ్ బ్రాండ్ విదా (Vida) ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలతో కలిపి రూ.1-1.5 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్, ఎథేర్ ఎనర్జీ వంటి పలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీలు రూ.లక్ష లోపు ధరకే ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. రోజురోజుకు గిరాకీ పెరుగుతున్న ఈవీ సెగ్మెంట్లో తన వాటా పెంచుకోవాలని విదా ఉవ్విళ్లూరుతోంది. పలు స్టార్టప్ కంపెనీలు, సంప్రదాయ కంపెనీల రంగ ప్రవేశంతో కొన్నేండ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో గణనీయ పురోగతి సాధిస్తోంది.
మరోవైపు నూతన ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల అభివృద్ధి కోసం జీరో మోటార్ సైకిల్ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు. తద్వారా న్యూ ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల మార్కెట్లోకి విస్తరించాలన్నది హీరో మోటో కార్ప్ లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశీయ ఈవీ స్కూటర్ల మార్కెట్లో విదా వీ1 వాటా పెరుగుతున్నదని, భవిష్యత్ లో విదేశాల్లోనూ ఆవిష్కరిస్తామని పవన్ ముంజాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు నుంచి 100 నగరాలకు విదా ఈవీ స్కూటర్ మార్కెట్ విస్తరించిందన్నారు. మరోవైపు ప్రస్తుతం హీరో మోటో కార్ప్.. పబ్లిక్ చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంపై దృష్టి సారించింది. అందుకోసం ఎథేర్ ఎనర్జీతో కలిసి ఈవీ టూ వీలర్ల చార్జింగ్ కోసం విదా దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను నెలకొల్పిందని ముంజాల్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

