ముంబై, ఆగస్టు 31: విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహన (ఎలక్ట్రిక్ టూవీలర్లు) కొనుగోలుదారులకు సులభంగా రుణాలు లభించేలా వీల్స్ ఈఎంఐతో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. దీంతో ఆకర్షణీయమైన వడ్డీరేట్లకు, అనువైన కాలపరిమితికి, తక్కువ ఈఎంఐలతో కస్టమర్లు వాహన రుణాలను పొందవచ్చని మంగళవారం ఓ ప్రకటనలో హీరో ఎలక్ట్రిక్ తెలియజేసింది.