Best Smart Phones | ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల మయం.. ఉద్యోగుల నుంచి గృహిణుల వరకు.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు మొదలు విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరూ ప్రతి అంశానికి స్మార్ట్ ఫోన్‌పైనే ఆధార పడుతున్నారు. డేటాతోపాటు మంచి ఫీచర్లు గల కెమెరా ఆప్షన్లు.. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ సర్వీస్.. బ్యాటరీ సపోర్ట్ వంటి పలు అంశాల్లో మెరుగ్గా ఉన్న స్మార్ట్ ఫోన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా దేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5జీ సేవలందించే బడ్జెట్ ఫోన్లు అందుబాటులోకి తెస్తున్నాయి వివిధ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు.. అలా ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల లోపు ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేద్దామా..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ లావా.. భారత్ మార్కెట్లోకి బ్లేజ్5జీ (Lava Blaze 5G) ఫోన్ తీసుకొచ్చింది. దీని ధర రూ.10,999 మాత్రమే. ఈ ఫోన్ సింగిల్ 4జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ విత్ హెచ్డీ + రిజొల్యూషన్ (720×1600 పిక్సెల్స్) కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 90 హెర్ట్ రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌గా ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది.
లావా బ్లేజ్5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ కెమెరా ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంది. లావా బ్లేజ్ 5జీ ఫోన్.. ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ అప్డేట్ చేస్తామని హామీ ఇచ్చింది. రెండేండ్ల పాటు సెక్యూరిటీ సపోర్ట్ ఉంటుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా.. మార్కెట్లోకి మోటో జీ52 (Moto G52) తీసుకొచ్చింది. ఈ ఫోన్ 6.60-అంగుళాల డిస్ప్లే విత్ 1080×2400 పిక్సెల్స్ రిజొల్యూషన్‌తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ కలిగి ఉంది. 6జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో వచ్చింది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-ఎంపీ, 2-ఎంపీ సెన్సర్లతో కూడిన కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో 6జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.10,999, 6జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.12,999లకు అందుబాటులో ఉంది.
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) దేశీయ మార్కెట్లోకి అత్యంత చౌక ధరకు ఐక్యూ జడ్6 లైట్ 5జీ ( iQoo Z6 Lite 5G) ఫోన్ తీసుకొచ్చింది. 5జీ నెట్వర్క్ సపోర్ట్‌తోపాటు విశ్వసనీయమైన పనితీరు (reliable performance)కు మారుపేరుగా ఐక్యూ జడ్6 5జీ ( iQoo Z6 Lite 5G) నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నది. దీని ధర రూ.13,999 నుంచి మొదలవుతుంది. 6.58- అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే విత్ 120 హెర్ట్ రీఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తున్నది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్న లావా బ్లేజ్ 5జీలో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-ఎంపీ డెప్త్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12-బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 12 స్కిన్ వర్షన్‌పై పని చేస్తుంది.
మోటరోలా మార్కెట్లోకి మరో 5జీ ఫోన్.. మోటో జీ 51 ఫోన్ తీసుకొచ్చింది. 6.80-అంగుళాల డిస్ప్లే విత్ 1080×2400 పిక్సెల్స్ రిజొల్యూషన్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 480 + ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ 4జీబీ రామ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో వచ్చింది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 13-మెగా పిక్సెల్స్ రిజొల్యూషన్ కెమెరా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.14,999గా నిర్ణయించారు.