హెచ్డీఎఫ్సీ సంచార ఏటీఎంలు

హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సేవలు
ముంబై, ఏప్రిల్ 24: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 నగరాల్లో సంచార ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్ విజృంభణ, పాక్షిక లాక్డౌన్లు, ఇతర ఆంక్షల నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యాన్ల ద్వారా ఈ మొబైల్ ఏటీఎంలను తీసుకువచ్చామని శనివారం బ్యాంక్ తెలిపింది. ఈ సంచార ఏటీఎంలతో నగదు ఉపసంహరణ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదన్నది. కాగా, మొత్తం 15 రకాల లావాదేవీలను ఈ మొబైల్ ఏటీఎంలలో ఖాతాదారులు పూర్తి చేయవచ్చు. రోజుకు 3-4 స్టాప్స్‌తో ఒక్కో చోట నిర్ణీత సమయం మేరకు ఈ సంచార ఏటీఎంలు ఆగి ఉంటాయి. దీంతో ఎవరైనా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. ‘మా మొబైల్ ఏటీఎంలు ఈ కష్ట కాలంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ ప్రతినిధి ఎస్ సంపత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలను అనుసరించే ఈ ఏటీఎంలను నిర్వహిస్తున్నామని, కస్టమర్లనూ అనుమతిస్తున్నామని చెప్పారు. గతేడాది కూడా దేశవ్యాప్తంగా 50కిపైగా నగరాల్లో బ్యాంక్ ఈ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, అలహాబాద్, సేలం, హోసూర్, భువనేశ్వర్, కోయంబత్తూర్, డెహ్రాడూన్ తదితర నగరాల్లో ఈ సేవలను తెచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- atm
- hdfc
- mobile atm
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

