HDFC Bank | ఆ 2 ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. రెండు ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీరేటు ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది.
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్’ రెండు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. సాధారణ ఖాతాదారులకు 35 నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.20 శాతం నుంచి ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో 7.15 శాతానికి పరిమితం అవుతుంది. అలాగే 55 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ 7.20 శాతానికి తగ్గించింది. ఈ వడ్డీరేట్ల తగ్గింపు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది.
మిగతా ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. 12 నెలల నుంచి 15 నెలల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల నుంచి రెండు సంవత్సరాల 11 నెలలు, మూడేండ్ల ఒక్కరోజు నుంచి నాలుగేండ్ల ఏడు నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. ఇక ఐదేండ్ల ఒక రోజు నుంచి 10 ఏండ్ల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

