న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: హోమ్ లోన్ మార్కెట్కు పండుగ కళ ముందే వచ్చేసింది. బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ ప్రత్యేక ఆఫర్లను వరుసగా ప్రకటించేస్తున్నాయి మరి. మంగళవారం దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ మార్ట్గేజ్ లెండర్ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సైతం గృహ రుణాలపై ప్రారంభ వార్షిక వడ్డీరేటును 6.7 శాతానికి కుదించింది. సోమవారం నుంచే ఈ రేటు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీలు పండుగ ఆఫర్ల పేరుతో హోమ్ లోన్లపై వడ్డీరేట్లకు కోత పెట్టిన విషయం తెలిసిందే. కాగా, అక్టోబర్ 31దాకా ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుందని, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ 800, ఆపై ఉంటేనే వడ్డీరేటు తగ్గింపు వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ ఈ సందర్భంగా తెలియజేసింది.