HCLTech | హెచ్-1బీ వీసాలపై ఆధార పడం.. తేల్చేసిన హెచ్‌సీఎల్ టెక్..!
HCLTech | తమ సంస్థ హెచ్-1బీ వీసా (H-1 B Visa)లపై ఆధారపడి పని చేయబోదని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ చెప్పారు.
HCLTech | హెచ్-1బీ వీసా (H-1 B Visa)పై ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో భారత ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసా (H-1 B Visa)ల జారీపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. దీనిపై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ స్పందిస్తూ.. తమ సంస్థ హెచ్-1బీ వీసా (H-1 B Visa)లపై ఆధారపడి పని చేయబోదని సోమవారం మీడియాకు చెప్పారు. ట్రంప్ హయాంలో ఐటీ బిజినెస్ మీద ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు.
‘అమెరికాలో పని చేస్తున్న మా ఉద్యోగుల్లో దాదాపు 80శాతం స్థానికులే. ఐటీ పరిశ్రమలో హెచ్1 బీ వీసాపై మా కంపెనీ ఆధారపడటం తక్కువ. ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. నాలుగేండ్ల క్రితం ఇదే పరిస్థితి ఎదురైంది. మేం ఉద్యోగుల నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తూ స్వావలంభన సాధించాం’అని రామచంద్రన్ సుందర రాజన్ చెప్పారు. ప్రతియేటా తమ సంస్థకు జారీ చేస్తున్న హెచ్-1బీ వీసా (H-1 B Visa)ల సంఖ్య దీన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతియేటా తమ సంస్థకు జారీ అయ్యే హెచ్-1బీ వీసా (H-1 B Visa)లు 500-1000 మధ్యే ఉంటాయన్నారు. సోమవారం ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.4,591కోట్ల నికర లాభం గడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

