కేంద్ర బృందంలో హరీశ్‌రావు

కొవిడ్ పరికరాలు, ఔషధాలకు పన్ను మినహాయింపుపై అధ్యయనం
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణకు ఉపకరించే పరికరాలు, ఔషధాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో మినహాయింపు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో అధ్యయన బృందాన్ని నియమించింది. ఈ బృందంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు దక్కింది. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందంలో హరీశ్‌రావు సహా ఎనిమిది మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. కరోనా నియంత్రణలో సహాయపడే టీకాలు, ఔషధాలు, పరికరాలు, కొవిడ్ టెస్ట్ కిట్ల లాంటి వాటికి జీఎస్టీ మినహాయింపులివ్వడంపై ఈ బృందం సిఫారసు చేయనున్నది. జూన్ 8న నివేదికను సమర్పించనున్నది. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశంలో జీఎస్టీ మినహాయింపుపై చర్చించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అధ్యయనానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

