బంగారానికి హాల్‌మార్కింగ్

- జూన్ 1 నుంచే అమలు చేస్తామన్న కేంద్రం
- గడువు పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
- రూ.130 తగ్గిన తులం ధర, కిలో వెండి రూ.66,040
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బంగారు ఆభరణాల స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్కింగ్ పద్ధతిని జూన్ 1 నుంచి తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆభరణ వ్యాపారులు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)కు మారేందుకు నిర్ణయించిన గడువును పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ప్రభుత్వం పసిడి స్వచ్ఛతను నిర్ధారించేందుకు హాల్‌మార్కింగ్ పద్ధతిని అమలు చేయాలని 2019 నవంబర్లోనే నిర్ణయించింది. ఇందుకోసం వ్యాపారులకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కానీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును జూన్ 1 వరకు పొడిగించింది. ఇకపై ఈ గడువును పొడిగించేది లేదని, హాల్‌మార్కింగ్ పద్ధతిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం తాజాగా ప్రకటించింది. జూన్ 1 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని అమ్మేందుకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34,647 మంది ఆభరణ వ్యాపారులు బీఐఎస్‌తో రిజిస్టరయ్యారు. రానున్న రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. సోమవారం రూ.46,223 పలికిన తులం బంగారం ధర.. మంగళవారం రూ.130 తగ్గి రూ.46,093కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.66,345 నుంచి రూ.66,040కు దిగివచ్చింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

