లక్ష్యాలకు తగిన రాబడి
‘గ్యారంటీడ్ గోల్ ప్లాన్’ పేరుతో కొత్త జీవిత బీమా పాలసీని పీఎన్బీ మెట్లైఫ్ ప్రవేశపెట్టింది. పొదుపే ధ్యేయంగా, పాలసీలో వినియోగదారుని లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితమైన రాబడి ఇచ్చేలా ఈ పాలసీని డిజైన్ చేశారు. 12 ఏండ్లపాటు ప్రీమియంను చెల్లించవచ్చు. ఎంత ఎక్కువ ప్రీమియంను చెల్లిస్తే అంత ఎక్కువ రాబడులుంటాయి. పాలసీ మెచ్యూరిటీ వరకు లైఫ్ కవర్ ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్తో బాధపడితే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. చెల్లించిన ప్రీమియంలకు పన్ను రాయితీలనూ పొందవచ్చు.